కర్నాటక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ను ఒడించడానికి శత విధాలా ప్రయత్నిస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శ్రీవారిని దర్శించుకోవడానికి గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయన శ్రీకృష్ణ అతిథి గృహం వద్దకు రాత్రి 8.40 గంటలకు చేరుకోగానే తిరుమల జేఈవో కె.ఎస్ శ్రీనివాసరాజు పుష్ఫగుచ్చం అందించి స్వాగతం పలికారు. అతిథిగృహంలో ఆయనకు టిటిడి అధికారులు ప్రత్యేక బస ఏర్పాట్లను చేశారు. ఆయనకు పెద్ద ఎత్తున భధ్రతా ఏర్పాట్లను చేయడంతో మీడియాను కూడా దరిదాపుల్లోకి పంపలేదు. ఆయన వెంట స్థానిక బిజెపి నేతలు భానుప్రకాష్‌రెడ్డి, కోలా ఆనంద్ ఉన్నారు. అమిత్ షా ఈ రోజు ఉదయం, తిరుమల శ్రీ వారని దర్శించుకున్నారు....
అయితే, తిరుమల శ్రీవారిని దర్శించుకుని, క్రిందకు వచ్చిన అమిత్ షాకు, అలిపిరి వద్ద నిరసనల సెగ ఎదురైంది... అమిత్ షా వచ్చే క్రమంలో, అలిపిరి వద్ద ఆందోళనతో నిరసన తెలపటానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు అక్కడకు చేరుకున్నారు... మమ్మల్ని మోసం చేసారు అంటూ ప్లెకార్డులు పట్టుకుని, నిరసనన తెలియ చేస్తున్నారు... అమిత్ షా గో బ్యాక్ అంటూ ఆందోళన.. అయితే, పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలో పాల్గునటంతో, తిరుమల నుంచి కిందకు రావటానికి అమిత్ షా మరికొంత సమయం తీసుకుంటున్నారు... కింద అందరినీ క్లియర్ చేసే దాకా, అమిత్ షా కిందకు రారు అంటూ, అమిత్ షా సెక్యూరిటీ, తిరుపతి పోలీసులుకు సమాచారం అందించారు...
దీంతో పోలీసులు, అలిపిరి వద్ద ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. మేము శాంతియుతంగా నిరసన తెలుపుతాం అని, అమిత్ షా కు మా నిరసన తెలియచేస్తామని ఆందోళన కారులు చెప్తున్నారు.. అయితే, అక్కడ వాతావరణం ఉద్రిక్తితకు దారి తియ్యటంతో, పోలీసులు వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. వారిని అక్కడ నుంచి పంపించి, క్లియరెన్స్ ఇచ్చే దాకా, అమిత్ షా తిరుమల నుంచి కిందకు వచ్చే అవకాసం కనిపించటం లేదు... మొత్తానికి, తెలుగుదేశం పార్టీ, మరో సారి, ఢిల్లీ నేతలకు చుక్కలు చూపిస్తుంది... అమిత్ షా లాంటి పవర్ఫుల్ నేతకు, ఆంధ్రోది దమ్ము ఏంటో చూపిస్తున్నారు... వీరిని చూసైనా, పవన్, జగన్, ఇప్పతకైనా మోడీ పై పోరాడాలి...