జగన్ బాగా కష్టపడి సంపాదించి, తను ఎంతగానో ఇష్టపడి నిర్మించుకున్న, బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో ఏమి జరుగుతుంది ? రేపు కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న వేళ, కర్ణాటక బీజేపీ మొత్తం, ఇక్కడ నుంచే పని చేస్తుందా ? విజయసాయి రెడ్డి కూడా ఇక్కడే ఉన్నాడా ? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అవును అనే సమాధానం వస్తుంది... చివరి రెండు రోజుల్లో జరిగే పోల్ మ్యనేజేమేంట్ అంతా, జగన్ బెంగుళూరు యలహంక ప్యాలెస్ నుంచే, బీజేపీ చేస్తుంది అని లోటస్ పాండ్ వర్గాలు కూడా చెప్తున్నాయి... జగన్ కు ఈ రోజు వీకెండ్ హాలిడే... ఈ రోజు కోర్ట్ కు వెళ్ళాల్సిన జగన్, నిన్న ఉదయామే హైదరాబాద్ వెళ్ళిపోయాడు... హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి, బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో ఉన్న వారితో, చర్చలు జరుపుతూ, పనులు చక్క బెడుతున్నారు...
మరో పక్క విజయసాయి రెడ్డి కూడా, బెంగుళూరు యలహంక ప్యాలెస్ లోనే ఉన్నట్టు సమాచారం వస్తుంది... ఎనిమిది రోజుల పాటు వైజాగ్ లో పాదయాత్ర చేసిన విజయసాయి రెడ్డి, నిన్న పాదయాత్ర ఆపేసాడు.. అదేమంటే మొదటి విడత పాదయాత్ర 9 వ తారీఖుతో ముగిసింది అని, రెండో విడత పాదయత్ర 14వ తారీఖున మళ్ళీ మొదలు అవుతుందని, అక్కడ వారికి చెప్పి, విజయసాయి రెడ్డి వైజాగ్ వదిలి వెళ్ళిపోయారు... ఎక్కడకు వెళ్ళారో, తెలియక వైజాగ్ వైసిపీ క్యాడర్ అవాక్కయింది... ఒక పక్క జగన్ వారానికి 4 రోజులు పాదయత్ర చేస్తూ, 3 రోజులు సెలవు తీసుకుంటుంటే, విజయసాయి రెడ్డి కూడా, విడతల వారీ పాదయత్ర చేస్తున్నారని గుసగుసలాడుతున్నారు... అయితే, ఇక్కడ పాదయత్ర ఆపేసి, బెంగుళూరులో వాలాడు అనే సమాచారం ఉంది..
జగన్ బెంగుళూరు యలహంక ప్యాలెస్ వాడుకోవటం వెనుక, ముఖ్యంగా గాలి వర్గం ఉందని చెప్తున్నారు.. గాలి వర్గం, జగన్ మోహన్ రెడ్డి ఎంత దగ్గరో అందరికీ తెలిసిందే.. గాలి వర్గానికి చెందిన శ్రీరాములు, బీజేపీ డిప్యూటీ సియం అభ్యర్ధి... మరో పక్క, అమిత్ షా ఆదేశాల మేరకు, గాలి, జగన్ కలిసి, బీజేపీ గెలుపు కోసం, బాగా ఖర్చు పెడుతూ, కష్టపడుతున్నారు.. ఆ కష్టంలో భాగంగానే, చివరి నిమిషంలో చేసి, గొప్ప పనులు కోసం, జగన్ ప్యాలస్ వాడుతూ పనులు కానిస్తున్నారు... ఇప్పటికే వైసిపీకి చెందిన చాలా మంది ఎమ్మల్యేలు, నాయకులు, బహిరంగంగానే, బీజేపీ తరుపున కర్ణాటకలో ప్రచారం చేసారు.. ఇప్పుడు చివరి నిమిషంలో జగన్ ప్యాలస్, బీజేపీ ఈ విధంగా వాడుకుంటుంది...