టిడిపి విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం నాడు అమరావతిలోని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.. వైసీపీ ఎంపీల రాజీనామాలను జూన్ 2 తర్వాత ఆమోదించే అవకాశం ఉందని, ఈ మేరకు సమాచారం ఉందని చెప్పారు.. ఉప ఎన్నికలు వస్తే తడాఖా చూపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు... ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పారు... తెలంగాణలో ఒక సారి 25 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే... మనం ఏడు సీట్లు గెలుచుకున్నామని సమావేశంలో గుర్తుచేశారు. వైసీపీ, బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, కర్ణాటకలో ఎన్జీవో నేత అశోక్‌బాబుపై దాడి చేసింది వైసీపీ వారేనని ఆరోపించారు. ఇద్దరూ కలిసి రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారని, ప్రజలకు అన్ని విషయాలను తెలపాల్సిన సమయం ఆసన్నమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
"రాష్ట్రానికి హోదా ఇస్తామని 3సభల్లో మోడి చెప్పారు.. అన్యాయం చక్కదిద్దుతామని మోడి మాట ఇచ్చారు. పదేళ్లు హోదా ఇస్తామని బిజెపి మేనిఫెస్టోలో పెట్టింది. నాలుగేళ్లుగా హోదా గురించి అడిగాం,29సార్లు ఢిల్లీ వెళ్లి ఒత్తిడి తెచ్చాం. అయినా నిర్లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తోంది.అందుకే ధర్మపోరాటం ప్రారంభించాం. పటేల్ విగ్రహానికి రూ.2,500కోట్లు,రాజధానికి రూ.1500కోట్లు ఇస్తారా..? రూ.1500కోట్లతో ఢిల్లీని మించిన రాజధాని నిర్మాణం సాధ్యమేనా..? స్వల్పంగా నిధులు ఇచ్చి వాటికీ యూసీల పేరుతో పేచీ పెడతారా..? ఇది రాష్ట్రంలో ప్రతిఒక్కరి సమస్య.ఏ ఒక్కరి సమస్య మాత్రమే కాదు.అన్ని పార్టీలు,ప్రజాసంఘాలు సమన్వయంగా పనిచేయాలి,రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి" అంటూ చంద్రబాబు తెలిపారు.
"ఏపికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది.మనకే ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సగటు మనిషికి పూర్తి అవగాహన ఉంది.వైకాపా లాలూచీని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. కేంద్రం సహకరించినా,సహకరించక పోయినా అభివృద్ది ఆగిపోరాదు. 15వ ఆర్ధికసంఘం టివో ఆర్ అర్ధరహితంగా ఉన్నాయి. జనాభా పెరిగితే నిధులు పెంచుతామనడం ధర్మమేనా..? జనాభా నియంత్రణ పాటించడం రాష్ట్రాల తప్పిదమా..? జనాభాను బట్టి ఎంపీ సీట్లు కూడా తగ్గిస్తామంటారా..? మేము చేయని తప్పులకు మా హక్కులను కోల్పోవాలా..?" అంటూ చంద్రబాబు ప్రశ్నించారు...