హైదరాబాద్ లో కూర్చుని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తున్న జగన్, పవన్, అతి ముఖ్యమైన విషయంలో మాత్రం మౌనంగా ఉంటున్నారు... ఇప్పటి వరకు కనీసం, ఈ మాట కూడా ఎత్తలేదు... అదే తెలంగాణా మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన విద్యుత బకాయలు... ఒకటి రెండు కాదు, 5700 కోట్లు మనకి బాకీ ఉన్నాడు, కెసిఆర్... కెసిఆర్ ప్రత్యెక హోదాకు మద్దతు ఇస్తున్నారని, ఆహా ఓహో అంటున్న వారు, మనకు తెలంగాణా నుంచి రావల్సిన వాటి గురించి మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు ఎత్తరు... జగన్ మాట్లాడడు, పవన్ మాట్లాడడు, మిగతా వారు మాట్లాడరు... వీటి మీద కేంద్రాన్ని అడగరు... వీటి కోసం ఆందోళన చెయ్యరు... మోడీ అంటే, వీరిద్దరికీ ఎలాగూ భయం, కనీసం కెసిఆర్ ని అయినా అడుగుతారు అనుకుంటే, కెసిఆర్ కు భజన చేస్తారు కాని, మన రాష్ట్రానికి రావాల్సిన 5700 కోట్ల బాకీ గురించి ఎవరూ మాట్లాడారు... మరి చంద్రబాబు ఏమి చేస్తున్నాడు అంటారా ?

pawan jagan 10052018 2

రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై, మోడీనే వాయిస్తున్నాడు చంద్రబాబు, ఈ కెసిఆర్ ఒక లెక్కా ? ఏకంగా తెలంగాణా సంస్థల పై, దివాళా ప్రక్రియ ప్రారంభించాలని కేసు వేసారు.. మాది ధనిక రాష్ట్రం, మాకు ఆంధ్రప్రదేశ్ తో పోలిక ఏంటి అంటూ డాంబికాలు పోయిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, మన ఆంధ్రప్రదేశ్ కరెంటు వాడుకుని, మనకి బాకీ ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయాడు... మానకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, బిల్డ్ అప్ ఇస్తూ, బయట తిరుగుతూ, ఫోజులు కొడుతున్న కెసిఆర్ పై దూకుడుగా ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా, ఒక ప్రభుత్వ సంస్థ, మరొక ప్రభుత్వ సంస్థ నుండి తన బకాయిలను తిరిగి పొందడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) వద్దకు వెళ్లి, ఆ సంస్థ పై దివాలా ప్రక్రియ ప్రారంభించి, ఆస్తులు జప్తు చేసి, మా బాకీ మాకు తీర్చేలా చెయ్యండి అంటూ, పిటీషన్ వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ...

pawan jagan 10052018 3

తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌), ఉత్తర ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌)ల నుంచి రూ.5732.40 కోట్లు బకాయి రాబట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ విద్యుదుత్పత్తి కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ జెన్‌కో) న్యాయపోరాటం ప్రారంభించింది. నోటీసులిచ్చినా తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలు స్పందించలేదని.. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ల దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌లో ఏపీ జెన్‌కో వేర్వేరుగా రెండు దరఖాస్తులు దాఖలు చేసింది. ఏపీ జెన్‌ కో తరఫున ఎండీ కె.విజయానంద్‌ ఈ దరఖాస్తులను దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన ఎన్‌సీఎల్‌టీ జ్యుడీషియల్‌ సభ్యులు మురళి.. కౌంటరు దాఖలు చేయాలని తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్‌ 1వ తేదీకి వాయిదా వేశారు. కనీసం, ఇప్పటికైనా కొంచెం ధైర్యం తెచ్చుకుని, పవన్, జగన్, ఈ విషయం పై పోరాడాలని ఆశిద్దాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read