దేశ రాజకీయాలు నేను మార్చేస్తున్నా, మోడీ లేదు, సోనియా లేదు, కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని నాశనం చేసాయి, నేనే ఢిల్లీని ఏలుతా అంటూ, నాకు మాయావతి ఫోన్ చేసింది, ఇంకా ఎవరో ఫోన్ చేసారంటూ హడావిడి చేసిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలు గుర్తుండే ఉంటాయి... అప్పట్లో, చూసారా కెసిఆర్ ఎలా పోరాడుతున్నారో, చంద్రబాబుకి ధైర్యం లేదు అంటూ ఇక్కడ కొంత మంది హడావిడి చేసారు.. పవన్ కళ్యాణ్ లాంటి నేతలు అయితే, ట్విట్టర్ లో, హాట్స్ ఆఫ్ చెప్పారు... ఇక హోదా పై మద్దతు తెలిపారని, కవితను చెల్లలు అంటూ, ట్వీట్ చేసారు పవన్... ఇది ఇలా ఉండగా, దక్షిణాది రాష్ట్రాలతో పాటు, మరి కొన్ని ఉత్తరాది రాష్ట్రాలను నిర్వీర్యం చేసే విధంగా, 15వ ఆర్థిక సంఘం విధి విధానాలు ఉండటంతో, ఈ రాష్ట్రాలన్నీ కేంద్రం పై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యాయి...
ఈ నేపధ్యంలో మొదటి సమావేశం కేరళలో జరిగింది, రెండో సమావేశం ఈ రోజు అమరావతిలో జరుగుతుంది. వివిధ రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో కేంద్రానికి వ్యతిరేకంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.. దక్షిణాది నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి అధిక ఆదాయం వస్తున్నా… నిధుల విడుదలలో వివక్ష చూపిస్తున్నారని దక్షిణాది రాష్ట్రాలు ఎప్పటి నుంచో విమర్శలు గుప్పిస్తున్నాయి.. అయితే, ఇలాంటి కీలక సమావేశానికి, కెసిఆర్ మాత్రం ఎవరినీ పంపలేదు.. పోయినసారి, తిరువనంతపురంలో జరిగే సమావేశానికి రావటం కుదరదు అని, చాలా బిజీగా ఉన్నాం అంటూ, కబురు పంపించింది తెలంగాణా...
అయితే ఈ రోజు అమరావతిలో జరిగే సమావేశానికి తెలంగాణా నుంచి ఎవరూ రాలేదు. నేటి ఆర్థికమంత్రుల సమావేశానికి తాను హాజరుకావడం లేదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. దీనిపై వివరణ అడగ్గా.. స్పందించడానికి ఆయన ఇష్ట పడలేదు. ఎందుకు రావటం లేదో సరైన కారణం చెప్పటం లేదు... ఈ నిర్ణయంతో, వీరు మోడీ తొత్తులు అనేది మరోసారి స్పష్టం అయ్యింది... మొన్న పార్లమెంట్ సమావేశాలు అప్పుడు కూడా, అన్నడీయంకే, తెరాస పార్టీలే గోల చేసి, అవిశ్వాస తీర్మానం రాకుండా అడ్డు పడ్డాయి... చివరి వారం రోజులు తెరాస ఎంపీలు వెనక్కు తగ్గారు... కాని అన్నడీయంకే కొనసాగించింది... దేశంలో అన్ని పార్టీలు, ఈ రెండు పార్టీల చేత, బీజేపీనే గోల చేస్తుంది అని విమర్శలు కూడా చేసాయి... ఈ రోజు, అన్ని దక్షినాది రాష్ట్రాలు సమావేశం అయ్యి, కేంద్రం పై ఒత్తిడి తెస్తుంటే, తెలంగాణ, డుమ్మా కొట్టింది... దీంతో, పూర్తి క్లారిటీ వచ్చేసింది...