విశాఖ నగరానికి మరో తలమానికమయ్యే ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. సోలార్ విద్యుత్ పై మొదటి నుంచి ద్రుష్టి సారించిన చంద్రబాబు, ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారు... రిజర్వాయర్ల పై తేలియాడే సోలార్ విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థకు జి.వి.ఎం.సి. శ్రీకారం చుట్టింది. రూ. 11 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తేలియాడే సౌర విద్యుత్తు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మడసర్లోవ రిజర్వాయరు ఇప్పటి వరకు నీటిని అందించింది. ఇప్పుడు విద్యుత్తు కూడా అందించడానికి సిద్ధమవుతోంది. అదెలాగంటే ఆ నీటి పై సోలార్ పలకలు అమర్చడానికి వీలుగా తేలియాడే పలకలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. జి.వి. ఎం.సి. ఆధ్వర్యంలో హైదరాబాదుకు చెందిన పి.ఇ.ఎస్. ఇంజినీర్స్ లిమిటెడ్ సంస్థ ప్రాథమిక నిర్మాణ పనుల్ని ప్రారంభించింది. వీటిపై సౌర పలకలను ఏర్పాటు చేయడం ద్వారా 2 మెగావాట్ల విద్యు త్తును ఉత్పత్తి చేయాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. ఇక్కడి నుంచి పైనాపిల్ కాలనీ వద్దనున్న విద్యుత్తు గ్రిడ్‌కు అనుసంధానించాలన్నది ప్రతిపాదన.
కాగా జులై నెలాఖరు నాటికి ప్రాజెక్టు అమల్లోకి తేవల్సి ఉంది. తేలియాడే ప్లాస్టిక్, ఫైబర్ పెట్టెలకు సౌరఫలకాలు అమర్చడమే కాకుండా, కింద స్పీంగ్స్ ఏర్పాటు చేయడం ద్వారా నీటి మట్టం తగ్గినప్పుడు అవి కూడా కిందకు దిగుతాయి. నీటి మట్టం తగ్గినా, పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడమే ఈ ప్రాజెక్టు విశేషం. అయితే వర్షం లేకపోవడం వల్ల సౌరపలకల పై దుమ్ముధూళి పొరలా పేరుకుపోయే అవకాశం ఉంది. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉంటుంది. మరో మూడు నెలల్లో ప్రాజెక్టు అమల్లోకి తేవాలని జి. వి. ఎం.సి. ప్రయత్నిస్తోంది. స్మార్ట్ సిటీగా మారుతున్న విశాఖపట్నం ఇప్ప టికే అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది. గజం స్థలం లక్షరూపాయలకు చేరుతున్న నేటి రోజుల్లో భవిష్యత్తులో భూమి అవసరం చాలా ఉంది. సౌర విద్యుత్తు కోసం చాలా భూమి వినియోగించాల్సి ఉంటుంది. ఆ భూమిని సోలార్ ప్యానళ్లతో నింపేస్తే ఏ విధంగానూ ఇతర వినియోగానికి సాధ్యం కాదు. కాబట్టి, రిజర్వాయర్లు, కాలువలపై సౌర విద్యుత్తు ప్రాజెక్టుల పై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఇవీ లాభాలు... రిజర్వాయర్లపై తేలియాడే సౌర విద్యుత్తు వ్యవస్థ వల్ల పచ్చదనం పాడయ్యే అవకాశం ఉండదు. నిర్మాణాలకు, ఇతర అవసరాలకూ భూమి ఉపయోగపడుతుంది.... నీటిపై సూర్య కిరణాలు పడకపోవడం వల్ల నీరు స్వచ్ఛంగా ఉంటుంది. సూర్యకిరణాల వల్ల నాచుపెరిగి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇప్పుడు అలాంటి అవకాశం ఉండదు... ఇక వేసవి వేడి తీవ్రతకు నీరు ఆవిరై, రిజర్వా యర్లు అడుగంటిపోవడు తెలిసిందే... పై మూతలా పనిచేసే ప్యానళ్ల వల్ల నీరు ఆవిరయ్యే అవకాశం ఉండదు... నీటి నిల్వ ఉంటుంది. మన ఇంటి పై నీటి ట్యాంకరుకు మూత వేయడం ద్వారా నాచు పట్టకుండా, నీరు ఆవిరవకుండా ఎలా ఉంటుందో అలాంటి భద్రత ఉంటుంది.