ఈ రోజు తిరుమలలో, ఆంధ్రులు చేస్తున్న ధర్మ పోరాటానికి, చిరుజల్లులతో వెంకన్న ఆశీర్వదించారు... ఉదయం నుంచి, ప్రచండమైన ఎండ వేడి నుంచి, సభకు వచ్చిన ప్రజలు ఉపసమనం పొందారు... 4 గంటల ప్రాంతంలో, కొద్ది సేపు వర్షం పడి, ఉపసమనం కలిగించింది... అయితే, వర్షం సభకు అడ్డు వస్తుందేమో అని అనుకున్నా, వెంకన్న దయతో, వర్షం తగ్గిపోయింది. బహిరంగ సభ వద్దకు ప్రజలు భారీగా తరలివస్తున్నాయి... వాతావరణం చక్కబడటంతో నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది... వరుణుడు సహకరించాడని.. సభ విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు...
మరో పక్క, తిరుమలలో వడగళ్ల వాన పడింది... అదే సమయంలో, చంద్రబాబు వెంకన్న దర్శనానికి వెళ్లారు... వర్షంలో తడుస్తూనే సీఎం శ్రీవారి ఆలయానికి వెళ్లారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబుతో పాటుగా మంత్రి లోకేష్ శ్రీవారి దర్శంచుకున్నారు... మరి కొద్ది సేపట్లో, చంద్రబాబు సభా వేదిక వద్దకు రానున్నారు.. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం చూపిన నిర్లక్ష్య వైఖరిని చంద్రబాబు ఈ సభలో ఎండగట్టనున్నారు. సభలో ప్రధాని మోదీ ప్రసంగాల వీడియోలను ముఖ్యమంత్రి ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
తిరుమల వెంకన్న సాక్షిగా హోదా ఇస్తామని వంచన చేసిన నరేంద్ర మోదీ, బీజేపీలపై సమరాన్ని టీడీపీ మరింత ఉధృతం చేసింది. ఇందులో భాగంగా తిరుపతిలో సోమవారం భారీస్థాయిలో ధర్మపోరాట సభ నిర్వహిస్తోంది. 2014 ఏప్రిల్ 30వ తేదీన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని తారకరామ స్టేడియంలో మోదీ ప్రత్యేక హోదా ఇస్తామని, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వాటిని నెరవేర్చకుండా మోసగించారని మండిపడుతున్న తెలుగుదేశం పార్టీ.. అదే ఏప్రిల్ 30న అదే ప్రాంగణం నుంచి మోదీ మోసాన్ని జనానికి తెలియజెప్పే విధంగా సభ నిర్వహిస్తోంది.