Sidebar

16
Wed, Apr

ధర్మపోరాట సభ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌. ..నారదుడి వేషంలో వింటే ఉంటావు మోడీ అని చెప్పా…అయినా వినలేదు. చంద్రబాబుకు భూమికి ఉన్నంత సహనం, ఆకాశం అంత ఔదార్యం, సహనం ఉంది, గాలి కంటే వేగంగా నిర్ణయాలు తీసుకునే దక్షత ఉంది అటువంటి వ్యక్తితో పెట్టుకోవద్దు మాడి మసైపోతావు మోడీ అని చెప్పానని అయినా వినలేదనీ ధర్మపోరాట సభ వేదికపై శివప్రసాద్ చెప్పారు..అజాతశత్రువు లాంటి చంద్రబాబు నాయుడు అలిగితే దేశమంతా ఒక్కటవుతుందని హెచ్చరించారు. తెలుగు ప్రజలను తక్కువ చేయొద్దని అన్నారు. ఎన్టీఆర్‌ని పదవి నుంచి దించేస్తే ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలన్నారు.

అష్టకష్టాలు పడతావంటూ విశ్వామిత్ర మహర్షిలా శాపనార్థాలు పెట్టారు. అయినా మోడీకి ఏమీ వినపడట్లేదని.. వినపడేలా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తాను ఇటీవల మోదీని విశ్వామిత్రుడి వేషంలో శపించానని టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ అన్నారు. 'మోదీ మోసాలలో దిట్ట.. అబద్ధాల పుట్ట.. నిన్ను అపజయాలు చుట్టుముట్ట.. నీ నెత్తిమీద శని తిష్ట' అని అన్నానని తెలిపారు. మోదీకి మనం చెప్పేది ఏమీ వినపడట్లేదని, ఎందుకంటే ఆయన ఇండియాలో ఉంటేనే కదా అని, పార్లమెంటు సమావేశాల్లోనూ మొదటి రోజు ఐదు నిమిషాలు వస్తారని శివప్రసాద్‌ వ్యాఖ్యానించారు.

ప్రధాని అభ్యర్థిగా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు అనేక హామీలు గుప్పించిన విషయాన్ని మరోసారి గుర్తు చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఈ సభను ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా ఆనాడు మోదీ ఏమి చెప్పారు, నేటి వాస్తవ పరిస్థితి ఏమిటో తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించారు... మోదీ ప్రసంగాల వీడియోలను ఆయన ప్రదర్శించారు... చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ సారథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read