డిఫెన్స్ ఎక్స్‌పో కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి తమిళ ప్రజలు చుక్కలు చూపించారు... ప్రధాని మోడీకి కావేరి సెగలు తాకాయి.. చెన్నై ఎయిర్‌పోర్టు వద్ద ప్రధాని మోడీకి వ్యతిరేకంగా తమిళ సంఘాల కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు... చెన్నైలో డిఫెన్స్ ఎక్స్‌పోను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు... కావేరి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించిన ఆందోళనకారులు నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చే శారు... అలాగే గోబ్యాక్ మోడీ అంటూ ఆకాశంలోకి సైతం ఆందోళనకారులు బెలూన్లు ఆకాశంలోకి వదిలారు. పెద్ద సంఖ్యలో బెలూన్లను వదలడంతో ఏం జరుగుతుందోన్న టెన్షన్ వాతావరణం నెలకొంది... హెలికాప్టర్ రూట్ కూడా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది...
మరోవైపు, మోడీ రాకను వ్యతిరేకిస్తూ డీఎంకే తో పాటు ఎండీఎంకే నేతలు కూడా చెన్నైలో ఆందోళనలు నిర్వహించారు. డీఎంకే వర్కింగ్ ప్రసిడెంట్ స్టాలిన్, ఎంపీ కనిమొళితో పాటు పలువురు డీఎంకే నేతలు ఆ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. కదలలేని స్థితిలో ఉన్న డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కూడా తన ఇంట్లో నల్ల చొక్కా వేసుకొని నిరసన తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో కూడా, గో బ్యాక్ మోడీ అని ట్రెండ్ చేసారు... మరోవైపు, ఎండీఎంకే నేత వైకోను పోలీసులు అరెస్ట్ రజనీకాంత్ కూడా కావేరీ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. కేంద్రం దిగిరావాల్సిందేనన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా కేంద్రం అమలు చేయడంలేదని మండిపడ్డారు. కావేరి నిరసనల కారణంగా భద్రత ప్రశ్నార్థకం కావడంతో ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా చెన్నై నుంచి తరలించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే...
తమిళనాడు ప్రజల ఐక్యత ఎలా ఉంటుందో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చూశారు... మరి మన ఆంధ్రా ప్రజల ఐక్యత చూపించే సమయం కూడా వచ్చింది... పార్టీలకు అతీతంగా, కులాలకు, మతాలకు అతీతంగా, అందరూ ఏకం కావాల్సిన పరిస్థితి వచ్చింది.. మన పై యుద్ధం చేస్తాము అంటూ బెదిరిస్తున్న, ఢిల్లీ పాలకులను కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది... తమిళనాడులో కూడా, ఇక్కడి లాగే, కొంత మంది మోడీతో రాజీ పడిపోయారు... అన్నాడీయంకే పార్టీ లాలూచి పడిపోయింది... అయినా అక్కడ ప్రజలు ఏకం అయ్యారు... మనకు కూడా ఇక్కడ మోడీతో కలిసి, మన పోరాటాన్ని నీరుగార్చే వారు ఒకరికి, ఇద్దరు ఉన్నారు... వీరికి మోడీ అనే పేరు పలకాలి అన్నా భయం... వాళ్ళను పక్కన పెట్టి, ప్రజలు ఏకం కావల్సిన టైం వచ్చింది...