శుక్రవారం వేకువజాము 3:30కు సింగపూర్ చాంఘి అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగుపెట్టారు. సింగపూర్‌లో ఈరోజు ఒకరోజు పర్యటనలో బిజీ షెడ్యూల్ గడపనున్నారు. పారిశ్రామిక, వాణిజ్య, రాజకీయ ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు. ఉదయం 5:30 (IST) నుంచే ముఖ్యమంత్రి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలుత సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఎస్ ఈశ్వరన్‌తో బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ఫస్ట్ హెట్‌టీ-మింట్ ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్‌లో ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంలో, హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్ ఆర్ సుకుమార్, చంద్రబాబుని ప్రశ్నలు అడిగారు...

mint asia 13042018 1+

జాతీయ రాజకీయాల్లో మీ పాత్ర, ప్రణాళిక ఏమిటి, అని అడగగా, "జాతీయ రాజకీయాల్లో నాకు ఆసక్తిలేదని అంశాన్ని గతంలో నేను ఎన్నో పర్యాయాలు స్పష్టం చేశాను. నాకు అటువంటి ఆకాంక్షలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అన్ని రాష్ట్రాలకు అభివృద్ధిలో ఒక నమూనా రాష్ట్రంగా తీర్చిదిద్దటమే ప్రస్తుతం నా ముందున్న కర్తవ్యం. నా ఆకాంక్ష అదే." అంటూ చంద్రబాబు సమాధానం చెప్పారు... టెక్నాలజీలో రోల్ మోడల్ అని ఎలా చెబుతారు? అని మరో ప్రశ్న అడగగా, దానికి చంద్రబాబు స్పందిస్తూ... "నేను టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాను. డిజిటల్ పరిపాలనలలో భాగంగా ప్రభుత్వ విభాగాల ఫైళ్లను ఆన్‌లైన్ లో ఉంచాం. కంప్యూటర్ ద్వారానే ఫైళ్ల క్లియరెన్స్ ను పర్యవేక్షిస్తున్నాను. ముఖ్యమంత్రిగా నాకు ఒక డ్యాష్ బోర్డు ఉంది. సీఎం కోర్ డ్యాష్ బోర్డుకు అన్ని విభాగాలను అనుసంధానం చేశాం....."

mint asia 13042018 1+

"...తద్వారా వాస్తవిక సమాచార పద్ధతిలో పరిపాలనలో ముందుకు సాగుతున్నాం.రియల్ టైమ్ గవర్నెన్స్ మెరుగైన పరిపాలన అందిస్తున్నాం. రైతు వ్యవసాయిక సీజనులో చీడపీడల నివారణకు ఏ సీజనులో ఏ పంటకు ఏఏ క్రిమిసంహార మందులు వినియోగించాలో తెలియజేసే యాప్స్ ను మా రైతులు ఉపయోగిస్తున్నారు. అటువంటి టెక్నాలజీ ఉంది. నా ట్యాబ్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా విద్యుత్తు వీధి దీపాల నిర్వహణను పర్యవేక్షిస్తాను. సంఘవ్యతిరేక శక్తులైన రౌడీషీటర్లను అదుపు చేయడానికి యాప్ సేవలు ఉపయోగించుకుంటున్నాం. అదలా ఉంచితే మా రాష్ట్ర వృద్ధి రేటు 10.5% గా ఉంది. వచ్చే 15 నుంచి 20 ఏళ్లలో వృద్ధి రేటును 15% కు తీసుకెళ్లడానికి సంకల్పం తీసుకుని కష్టపడి పని చేస్తున్నాం. మా రాష్ట్రంలో పెట్టుబడులకు నాదీ భరోసా. ఆంధ్రప్రదేశ్ కి రండి. పెట్టుబడులు పెట్టండి. మా రాష్ట్రం వృద్దిరేటులో, అభవృద్ధిలో మరింత ఎదగడానికి మీ సహాయ సహకారాలను కోరుతున్నాను." అని అన్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read