సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు, ఫస్ట్ హెట్‌టీ-మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్‌లో పాల్గున్నారు... ఈ సందర్భంగా, చంద్రబాబు ఒక ప్రశ్నకు చెప్పిన సమాధానంతో, ఆయన స్టేట్స్మెన్ అనే విషయం మరో సారి రుజువైంది... దక్షిణాది రాష్టాల పట్ల కేంద్రం వివక్ష అవలంబిస్తోందన్నారు. దీనిపై మీ అభిప్రాయం, ఏంటి అని ప్రశ్న అడగగా, దానికి చంద్రబాబు స్పందిస్తూ, "అది చర్చించడానికి ఇది వేదిక కాదు. ఆ అంశంపై మనం భారత్ లో కూర్చుని మాట్లాడుకుందాం. కానీ నేను ఒక్క విషయం స్పష్టం చేయదలిచాను. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు శిక్షకు గురికాకూడదు. ఇది దేశాభివృద్ధినే ఆటంకపరుస్తుంది." అంటూ సమాధానం చెప్పి ఆపేశారు... పరాయి దేశంలో, అంతర్జాతీయ వేదికల పై, మన ప్రధాని గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో, చంద్రబాబు ఇలా సమాధానం చెప్పి, ఎంతో హుందాగా వ్యవహరించారు...
అలాగే వివిధ అంశాల పై చంద్రబాబు స్పందించారు... పోలవరం గురించి మాట్లాడుతూ, "విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. నీటి ఆయోగ్ సిఫారసులతో త్వరగా పూర్తిచేయాలన్న లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికే 53% నిర్మాణం పూర్తయింది. జూన్ 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లిస్తాం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇతర రాష్ట్రాలకూ నీరందించవచ్చు. గోదావరి నది ద్వారా ఏటా 3 వేల టీఎంసీల వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిలో కొంత భాగాన్ని ఉపయోగించుకుని నిన్న పట్టిసీమ పూర్తిచేశాం. రేపు పోలవరం పూర్తిచేస్తాం." అంటూ పోలవరం పై స్పందించారు...
అలాగే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశం మీద సీఎం స్పందిస్తూ "రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మేం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మా రాష్ట్రం నెంబర్-2 ఉంది. నెంబర్-1 కాగలమని ఆత్మవిశ్వాసం ఏర్పడింది. తర్వావత వరుసగా రెండేళ్ల నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మా రాష్టానికి ప్రపంచ బ్యాంకు నెంబర్-1 రేటింగ్ ఇచ్చింది. వ్యాపారానికి అన్నీ సానుకూలతలే ఉన్నాయి. ఏ రకమైన వేధింపులు లేవు. వేగంగా అన్ని అనుమతులిస్తున్నాం. వచ్చే మార్చినెల నాటికి కియా కార్ల పరిశ్రమ ఉత్పత్తిని ప్రారంభించనుంది. రండి. మా రాష్ట్రానికి వచ్చి స్వయంగా పరిశీలించి వ్యాపార అనుకూలతలో మా రాష్ట్రం ఏ రకంగా అగ్రగామిగా ఉందో మీరే పరిశీలించండి. మీకిదే మా ఆహ్వానం. ఐటీలో మేం అభివృద్ధి సాధించాం. పౌరుడు పౌరసేవలు పొందాలంటే ఐటీ ఆధారంగా గడప దాటకుండా సేవలు పొందే అవకాశాలు కల్పించాం. ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఏ సేవలనైనా ఎక్కడి నుంచైనా పొందే అవకాశం ఆన్ లైన్ ద్వారా కల్పించాం." అంటూ సమాధానం చెప్పారు...