భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 25 ఏళ్ల శ్రీకాంత్ నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా శ్రీకాంత్ రికార్డు సృష్టించాడు. దీంతో ఇప్పటి వరకు నెంబర్ వన్ స్థానంలో ఉన్న డెన్మార్క్ క్రీడాకారుడు విక్టర్ అలెక్సన్ రెండో ర్యాంకుకు పరిమితమయ్యాడు. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ ప్రస్తుతం 76,895 పాయింట్లతో కొనసాగుతుండగా.. విక్టర్ అలెక్సన్ 75470 పాయింట్లతో ఉన్నాడు... అయితే, శ్రీకాంత్ ట్విట్టర్ ద్వారా స్పందించి, తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కృతఙ్ఞతలు చెప్పారు...
గాయం కారణంగా గత ఏడాది అక్టోబరులో శ్రీకాంత్ నంబర్‌వన్ ర్యాంకును అందుకోలేకపోయాడు. కామన్వెల్త్ క్రీడల్లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన శ్రీకాంత్ 76,895 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. 77, 130 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న విక్టర్ అలెక్సన్(డెన్మార్క్) 1,660 పాయింట్లు కోల్పోయి 75,470తో రెండో స్థానానికి పడిపోయాడు. 52 వారాల వ్యవధిలో అత్యుత్తమ 10 టోర్నీల ప్రదర్శన ఆధారంగా బీడబ్ల్యూఎఫ్ ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. గత ఏడాది ఇండోనేషియా, ఆస్ట్రేలియన్, డెన్మార్క్, ఫ్రాన్స్ ఓపెన్ సిరీస్‌లు గెలుచుకున్న శ్రీకాంత్ నవంబరులో ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
కంప్యూటరైజ్డ్ ర్యాంకింగ్ పద్ధతి లేనప్పుడు 1980లో ప్రకాశ్ పదుకొణె నంబర్‌వన్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు మరో భారత క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ ఆ ఘనతను అందుకున్నాడు. 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ నంబర్‌వన్ ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. తాజా ర్యాంకింగ్స్‌లో పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది... గత ఏడాది, శ్రీకాంత్ నాలుగు సిరీసులను గెలుచుకున్న సందర్భాన్ని పరస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరుపున 50 లక్షల పారితోషికాన్ని, అమరావతి రాజధాని ప్రాంతంలో వెయ్యి గజాల స్థలాన్ని ఇస్తున్నట్టు, ఇండియన్ ఆయిల్ కంపెనీలో ఆసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ కు రాష్ట్రంలో గ్రూప్-1 కేడర్ ఉద్యోగం ఇస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే...