మంగళగిరి సీవీ కన్వెనన్లో సీఆర్డీయే, సీఐఐ సంయుక్త ఆధ్వర్యంలో మూడురోజుల పాటు నిర్వహించే సంతోష నగరాల సదస్సులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది... ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన సంతోష నగరాల సదస్సులో భూటాన్లోని, జెలెఫర్ నగర మాజీ మేయర్ ఆకారాం కెప్లీ ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రధానమంత్రిగా సంభోదించారు...... స్మార్ట్ నగరాల నిర్మాణం పై తన అనుభవాలను వివరించిన కెప్లీ 'ప్రైమ్ మినిస్టర్' చంద్రబాబు నాయుడు ఓ విజన్ ఉన్న నాయకుడని అభివర్ణించారు. తనకు ఉన్న అపారమైన అనుభవంతోనే అమరావతి నిర్మాణానికి సదస్సు ఏర్పాటు చేశారన్నారు. ప్రధానమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దగలరనే నమ్మకం తమకు ఉందన్నారు.
ఒకపక్క భారత ప్రధాని నరేంద్రమోదీ పై ప్రత్యేక హోదా, విభజన హక్కుల సాధన కోసం విభేదించి కారాలు, మిరియాలు నూరుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఏకంగా ప్రధానమంత్రిగా కెస్లీ పేర్కొనటం విశేషం.... దీంతో రాష్ట్ర బీజేపీ నాయకులు అయితే, ఇది కావాలనే చంద్రబాబు చేసిన కుట్ర అంటూ, యధావిధంగా విమర్శలు చేస్తున్నారు... చంద్రబాబు ఇలా కావాలనే వాళ్ళ చేత చెప్పించుకుంటున్నారు అని అంటున్నారు... మరో పక్క నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తమవంతు సహకారాన్ని అందిస్తామని అభివృద్ధి నమూనాలో అనుభవాలను పంచుకుంటామని దేశ, విదేశీ ప్రతినిధులు వెల్లడించారు....
అమరావతి నిర్మాణంలో పరస్పర సహకారాన్ని అందించుకునేందుకు సంసిద్ధతను వ్యక్తంచేశారు, సింగపూర్ ప్రతినిధి... కంబోడియా మెడల్లిన్ నగర మాజీ మేయర్ అనిబల్ గవిరియా మాట్లాడుతూ వ్యవస్థాపరంగా నిర్మాణాత్మకమైన పాలనా విధానాలను అవలంబించడం ద్వారా స్మార్ట్ సిటీలు రూపాంతరం చెందుతాయన్నారు. సామాజిక అసమానతలను తొలగించడంతో పాటు ఆర్థికాభివృద్ధి సాధించి పర్యాటక కేంద్రాల అభివృద్ధితో సంతోష నగరాల మనుగడ సాధ్యమవుతుందని ఫిన్లాండ్ ఎంబసీ కమర్షియల్ కౌన్సెలర్ జుక్కా హోలప్ప అభిప్రాయపడ్డారు. భూటాన్లోని జెలెఫా టౌన్ మేయర్ తీకారాం కార్డే మాట్లా డుతూ తమ నగరంలో 15 మొక్కలు నాటితేనే భవన నిర్మాణానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మంజూరవుతుందన్నారు. సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ వచ్చే ఏడాది నాటికి రాజధాని మొదటి దశ నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు.