Sidebar

05
Mon, May

బేటి బచావ్ బేటీ బచావో నినాదం కాదు... బేటీ బచావో, ఆర్తనాదం... బేటీ బచావ్ అంటే, బీజేపీ ఎమ్మల్యేల నుంచి మీ ఆడబిడ్డలను కాపాడుకోండి అని... కూతుళ్ళ వయసు పిల్లల మీద బీజేపీ ఎమ్మల్యేలు చేసే బలాత్కారాల నుంచి పాపడుకోంది.... వాళ్ళ తండ్రులని పోలీసు ఠాణా లలో పెట్టి కుళ్ళబొడిచి -- పోలీసుల చేత చంపించి -- ఆ అమ్మాయి కుటుంబాన్నే దగా చేసే -- బీజేపీ ముఖ్యమంత్రుల నించా, బీజేపీ ప్రధాన మంత్రుల నుంచి కాపాడుకోండి... "బేటీ ! " అంటే ఉండే ఒక స్పందనే వీళ్ళకి తెలియదు . " బేటీ బచావ్ ! " -- అంటే ఆ బేటీ ని ఎవరినించి బచావ్ అని... బిడ్డలు లేని మోదీకి ఆడవారి బాధలు ఏం తెలుస్తాయంటూ సర్కార్ పాలనపై మాటల పోట్లు పెరిగాయి... దీక్షలు చేస్తున్న మోడీ గారు, ఈ ఆడకూతురుకి సమాధానం చెప్పి, దీక్షలు చెయ్యండి...

up modi 12042018

సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కుటుంబం, బంధాలు ఏవీ లేవని.. అందుకే తమ బాధలు పట్టడం లేదంటూ ఓ మహిళా నేత దూషించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ‘‘యూపీ సీఎం యోగికి భార్య, పిల్లలు, కుటుంబం లేదు. కన్నబిడ్డ, ఆడవారి ఆవేదన వారికి ఎలా తెలుస్తుంది..? మోడీకి పెళ్లి అయ్యిందే కానీ పిల్లల భాగ్యం లేదు. ఒక కూతురు అత్యాచారానికి గురయితే తండ్రి పడే బాధ మోడీకి తెలుసా..?’’ అంటూ మహిళ తీవ్ర విమర్శలు చేశారు. బేటీ బచావో అనే బీజేపీ పాలనలో.. ఆ నేతల నుంచే బాలికలకు రక్షణ లేకపోవడం దారుణమనే విమర్శలు వెల్లువెత్తాయి...

up modi 12042018

‘‘అధికార పార్టీ ఎమ్మెల్యే, అతడి సోదరులు అత్యాచారం చేశారు. వారిపై చర్యలు తీసుకోండి’’ అంటూ కోర్టును ఆశ్రయించిన అబలకు న్యాయం జరగలేదు సరికదా.. ఎదురు ఆమె తండ్రిపైనే తప్పుడు కేసు బనాయించి అతణ్ని అరెస్టు చేశారు ఖాకీలు! పోలీసుల కస్టడీలోనే తీవ్ర అస్వస్థతకు గురైన ఆ తండ్రి చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు! ఇది దేశంలో పరిస్థితి... మన ప్రధాన మంత్రి మాత్రం, అదరగొట్టే స్పీచ్ లు ఇచ్చి, దేశ ప్రజలను కడుపు నింపుకోమంటారు... ఆయన్ను ఎవరాన్నా ఏమన్నా అంటే, నేను పేద తల్లి కొడుకుని, నేను తక్కువ కులం వాడిని అంటూ, సెంటిమెంట్ డైలాగులు చెప్తున్నారు... రేప్ చేసారు అంటే చేపించుకోండి, ఎదురు తిరిగితే, మీ తండ్రిని చంపేస్తాం అనే మెసేజ్ ఈ దేశానికి ఇస్తున్న, బీజేపీని ప్రజలే సరైన శిక్ష వేస్తారు....

Advertisements

Advertisements

Latest Articles

Most Read