విదేశీ పెట్టుబడులను ఆకర్షించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ఎత్తున పరిశ్రమలను తీసుకొచ్చేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు.. అందులో భాగంగా మొబైల్ రంగంలో గుర్తింపు పొందిన షియామీ సంస్థ, ఎలక్ట్రానిక్ వస్తువల విడిభాగాలు తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది... పరిశ్రమ తిరుపతి పరిసర ప్రాంతాల్లో నెలకోల్పెందుకు అనువుగా సియం చొరవ తీసుకున్నారు... నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో పర్యటించి, షియోమీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు... ఈ సందర్భంగా రాష్ట్రంలో విడిభాగాల పరిశ్రమ స్థాపనకు ముందుకు రావాల్సిందిగా వారిని కోరారు. తిరుపతి ప్రాంతంలో అనుకూలతలు ఉన్నాయని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని వివరించారు.

cbn 12042018

జిల్లాలో ఫాక్స్‌కాన్‌ కంపెనీ భాగస్వామ్యంతో మొబైల్ తయారీ చేస్తున్న నేపథ్యంలో విడిభాగాలు ఇక్కడే ఉత్పత్తి చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు భూమితో పాటు అవసరమైతే నిర్మాణాలు చేసి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇలా ఆయా సంస్థల ప్రతినిధులను ఒప్పించేందుకు ప్రయత్నించారు. తిరుపతిలో కొద్ది గంటలే గడిపినా.. ఏకంగా 38 కంపెనీలకు చెందిన ప్రతినిధులతో ఒకేసారి సమావేశమై రాష్ట్ర ప్రాధాన్యతలను వివరించారు. తిరుపతి పరిసర ప్రాంతాలను హార్డ్‌వేర్‌తోపాటు ఎలక్ట్రానిక్‌ పరికరాల ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పలు పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పారు. తాజాగా షియామీ చరవాణులకు విడిభాగాలను అందించే సరఫరాదారులు తమ సంస్థలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా భారతదేశం వచ్చారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సీఎం నిర్ణయించి... అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు.

cbn 12042018

తిరుపతికి వచ్చిన 38 సంస్థలకు చెందిన మొబైల్ విడిభాగాల సరఫరాదారులతో నేరుగా సమావేశం కావాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా బుధవారం ఉదయం తిరుపతికి వెళ్లారు. సుమారు గంటన్నరకుపైగా వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ తాను చెప్పిన అంశాలతో సంతృప్తి చెందారని, పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ పరిశ్రమలు వస్తున్నాయని, ఇది మంచి పరిణామమని వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దీనికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మౌలిక వసతులు ఎక్కడ బాగుంటే అక్కడ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతారని అన్నారు. మొత్తంగా రాయలసీమ ప్రాంతంలో భారీగా పరిశ్రమలు వస్తున్నట్లు వెల్లడించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read