ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి, పాదయత్ర స్టైల్ గురించి అందరికీ తెలిసిందే... పాదయాత్ర అంటే ఈయనగారికి ఎంత జోక్ గా ఉందో ఇక్కడే అర్ధమవుతుంది... ఒక రాజకీయ నాయకుడు పాదయత్ర చేస్తే, అది ఎంత పవిత్రంగా చేస్తారో, మనం మన రాజకీయాల్లో చూసాం... రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఎలా పాదయాత్ర చేసారు అన్నది, మనకు ఇంకా గుర్తు ఉంది... ఈ జగన్ మాత్రం, ఏంటో తెలియదు... వారినికి రెండు రోజులు కోర్ట్ కు వెళ్ళాలని సెలవు పెట్టి, ఫ్లైట్ ఎక్కి, హైదరాబాద్ లో దిగుతాడు... పోనీ కోర్ట్ కు వెళ్తాడా అంటే, ఇంటికి వెళ్లి, మసాజ్ లు, ఫేషియల్ లు చేపించుకుని, రెస్ట్ తీసుకుని, హాయగా రెండు రోజులు ఎంజాయ్ చేసి, మళ్ళీ పాదయాత్ర అంటాడు...

jagan 12042018 1

వారానికి ఒక రోజు, శుక్రవారం కోర్ట్ కి పోవాలి.. అందుకోసం గురువారం మధ్యాహ్నం నుంచే మనోడు జంప్ అవుతాడు... గట్టిగా నడిచేది 5 రోజులు... మళ్ళీ మధ్యలో పండుగలు అని, అదని, ఇదని, హాలిడే తీసుకుంటాడు... అయితే, ఇన్నాళ్ళు గురవారం మధ్యాహ్నం పాదయాత్ర ఆపేసి వెళ్ళిపోతున్నాడు అంటే, పాపం హైదరబాద్ చేరుకోవాలి అంటే ఇబ్బంది కదా, మళ్ళీ కోర్ట్ కి లేట్ అయితే జడ్జి గారు ఊరుకోరు కాబట్టి వెళ్తున్నాడు అనుకున్నాం... కాని ఈయనగారు ప్రస్తుతం బెజవాడ బోర్డర్ లో ఉన్నాడు... ఉండవల్లి దగ్గర ఉన్నాడు... ఇక్కడ నుంచి ఎవరికైనా హైదరాబాద్ వెళ్ళాలి అంటే ఎంత టైం పడుతుంది ? బస్సులో వెళ్ళే మనమే, నాలుగు గంటల్లో హైదరాబాద్ వెళ్తున్నాం...

jagan 12042018 1

ఈయనగారు, కార్లు వేసుకుని వెళ్తాడు... మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు ట్యాగ్ ఒకటి ఉంటుంది కాబట్టి, ట్రాఫిక్ కు కూడా ఫ్రీ చేస్తారు... గట్టిగా కొడితే, మూడు గంటల్లో హైదరాబాద్ లో ఉంటాడు... అలాంటిది, ఒక్క రోజు ముందే ఇంటికి వెళ్ళటం ఏంటి ? అసలు ఇలాంటి పాదయత్ర ఎక్కడన్నా ఉంటుందా ? ఎంత దీక్షగా చేస్తారు, పాదయాత్ర అంటే ? చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇంటికి కూడా వెళ్ళలేదు... ఎప్పుడన్నా ఎవరన్న చనిపోయినప్పుడు వెళ్ళినా, అక్కడకు వెళ్లి, వెనక్కు వచ్చేసేవారు.. ఈయన మాత్రం, రెండు రోజులు వెళ్లి లోటస్ పాండ్ లో డొల్లుతాడు... మసాజ్ లు, ఫేషియల్ లు చేపించుకుని, రెస్ట్ తీసుకుని, హాయగా రెండు రోజులు ఎంజాయ్ చేసి, మళ్ళీ పాదయాత్ర అంటాడు... వీళ్ళు ప్రజా నాయకులు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read