రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పరారీలో ఉన్న నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన అనంతరం పోలీసులు 17 బృందాలతో నిందితుడి కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. కృష్ణా నది పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో అణువణువూ పరిశీలించారు. అయితే, నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారమందింది. దైదా దగ్గర ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలేసులు గుర్తించారు. అమరలింగేశ్వర దేవాలయం వద్ద మృతదేహాన్ని గుర్తించారు.
అయితే, ఈ ఆత్మహత్య ఫోటోలు చూపించి జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ, తెగ బాధ పడుతుంది. నిందితుడు ఆత్మహత్య చేసుకోలేదని, పోలీసులే చంపేసి, ఆత్మహత్య డ్రామా ఆడుతున్నారని, సాక్షి బ్రేకింగ్ న్యూస్ లు వేస్తుంది. మరో పక్క, అత్యంత అమానవీయంగా, అనాగరికంగా దుశ్చర్యకు ఒడిగట్టిన అలాంటి నిందితులను చంపితే తప్పు ఏంటి అని, అక్కడ గ్రామస్తులు అంటున్నారు. వాడిని పోలీసులు చంపినా అసలు తప్పే లేదు అని, ఇది కనుక నిజం అయితే, చంద్రబాబుకి లక్ష దండాలు అని చెప్తున్నారు.
మెజార్టీ ప్రజలు పోలీసులు మంచి పని చేశారు...అలాంటి వాడికి అదే తగిన శిక్ష అని అంటూండగా కొందరు హక్కుల కార్యకర్తలు మాత్రం పోలీసులు అలాంటి నిందితులను చట్టపరంగా శిక్షించాలి తప్ప అలా తమకు తోచిన న్యాయం చేయటం కరెక్టు కాదని దాచేపల్లి మానవ హక్కుల వేదిక నాయకుడు కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి మృగాలకు చట్టపరమైన శిక్షలు చాలవని, ప్రభుత్వంకి, పోలీసులకు ఈ విషయంలో మేం అండగా ఉంటామని ఖాసీం సాబ్ అన్నారు. మొత్తానికి, ఒక రేపిస్ట్ చచ్చిపోతే, అది ఎలాంటి చావైనా కాని, దానికి సాక్షి టీవీ బాధపడటం చూస్తుంటే, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు...