ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, ఇంకా ముసుగులు ఎందుకు అనుకున్నారో ఏమో, లేక అన్నిట్లో మనం కలిసి చేస్తున్న పని ఒకటే అనుకున్నారో ఏమో కాని, వైసిపీ, జనసేన పార్టీ ఫస్ట్ మీటింగ్ హైదరాబాద్ లో జరిగింది.. హైదరాబాద్ లోని, బంజారా హిల్స్ లోని ఒక ప్రముఖ హోటల్ లో, ఇరు పార్టీల నేతలు సమావేశం అయ్యారు.. దాదాపు గంటకు పైగా సమావేశం జరిగింది. ఈ భేటీలో జనసేన కీలకనేతలైన శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి, పవన్ వ్యక్తిగత సహాయకులు వేణు, చక్రవర్తి పాల్గొన్నారు. వైసీపీ నుంచి, ఆ పార్టీ లీగల్ సెల్ నేతలు వచ్చారు... వారి పేర్లు తెలియాల్సి ఉంది. అయితే, మొదటగా వీరి భేటీ సంగతి తెలుసుకుని ఒక మీడియా సంస్థ అక్కడ ముందుగానే కాచుకుని కూర్చుంది... అక్కడకు వచ్చిన వారు, ఆ మీడియాను చూసి జారుకున్నారు...
మళ్ళీ ఒక గంట తరువాత, ఆ మీడియా సంస్థ ప్రతినిధులు వెళ్ళిపోయిన తరువాత, మళ్ళీ వచ్చి సమావేశం అయ్యారు.. ఈ సమావేశంలో ప్రధానంగా, తెలుగుదేశం పార్టీని ఎలా నిలువరించాలి, భవిష్యత్తులో కలిసి కట్టుగా, టిడిపిని ఎలా దెబ్బ కొట్టాలి, చంద్రబాబుని పరిపాలన నుంచి ఎలా డైవర్ట్ చెయ్యాలి అనే విషయం పై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో జనసేన సలహాదారుడు చింతలబస్తీ దేవ్ కూడా రావాల్సి ఉండగా, చివరి నిమిషంలో మీడియా ఉంది అని తెలుసుకుని, ఇక్కడకు రాకుండా వెళ్లిపోయారని తెలుస్తుంది.. దాదాపు గంటన్నర పాటు, ఈ సమావేశం జరిగిందని, skype కాల్స్ లో, మిగిలిన ప్రముఖ నాయకులు కూడా, ఈ మీటింగ్ లో పాల్గున్నారని తెలుస్తుంది.
అయితే ఈ భేటీపై అటు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో ఏయే విషయాలపై చర్చిస్తున్నారు..? అసలు ఈ భేటీ ఎందుకు జరుగుతోంది..? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. మరో పక్క జనసేన, వైసిపీ నేతలు దాదాపు ఒకే మైండ్ ఫ్రేమ్ లో పని చేస్తున్నారు. ఇరు పార్టీలు మోడీని ఒక్కటంటే ఒక్క మాట కూడా అనటం లేదు.. కనీసం మోడీ అనే పేరు కూడా తలవటం లేదు. మరో పక్క ఇరు పార్టీల నేతలు, మోడీ పై పోరాడుతున్న చంద్రబాబు పై మాత్రం, ప్రతి రోజు విరుచుకు పడుతున్నారు. అదీ కాక, ఇప్పుడు పవన్ సలహాదారుడు చింతలబస్తీ దేవ్ కూడా, బీజేపీ నుంచి వచ్చినవాడు.. ప్రశాంత్ కిషోర్ అయితే, డైరెక్ట్ మోడీతో కలిసి పని చేసినవాడే.. ఇలా ఒకరికిఒకరు సహకరించుకుంటూ, బీజేపీ, వైసిపీ, జనసేన కలిసిపోయి, తెలుగుదేశం పై యుద్ధం ప్రకటించాయి... రానున్న రోజుల్లో రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి...