"జనాల్లో ఉన్నప్పుడు రామాచారిలా, సెయింట్‌లా కనిపిస్తాడు... పార్టీనేతల వద్ద జుట్టు విదిల్చిన అపరిచితుడిలా మారిపోతుంటాడు.." "నా పరిస్థితి ఎలా అయిందంటే పౌరాణిక సినిమా చూద్దామని థియేటర్‌కి వెళ్లి షకీలా సినిమా చూసినట్లయింది"... ఈ మాటలు వింటుంటే, ఎవరి గురించి మాట్లాదుతున్నామో, ఇట్టే అర్ధమైపోతుంది... ఈయన 2014లోని జగన్ మొదటి బాధితుడు... ఈ వ్యాఖ్యలు చేసింది, ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణరాజు... ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి గురించి, చెప్పిన మాటలు... ఒకప్పుడు వైసిపీ పార్టీలో ఉన్న రఘురామ కృష్ణరాజు, తన స్వీయ అనుభవంతో, జగన్ గురించి చెప్పిన మాటలు అవి... 2014 ముందు, జగన్ ని వదిలి, తరువాత బీజేపీ పార్టీలో చేరారు రఘురామ కృష్ణరాజు..

raghu 04052018 2

బీజేపీలో చేరినా, ఎప్పుడూ క్రియాశీలకంగా అక్కడ పని చేసింది లేదు.. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపధ్యంలో, బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న మోసం, ప్రజల ఆగ్రహం చూసి, ఆయన బీజేపీ నుంచి బయటకు రావటానికి నిర్ణయం తీసుకున్నారు.. ఈ రోజు, అమరావతి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.. అమరావతి వచ్చి, చంద్రబాబుని కలిసిన తరువాత, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఆయన బీజేపీ లో అసంతృప్తిగా ఉన్నారని తెలిసన దగ్గర నుంచి, జగన్ పార్టీ, జనసేన పార్టీ కూడా, ఆయన కోసం ఎంతో ట్రై చేసాయి..

raghu 04052018 3

రఘురామ కృష్ణరాజు స్వయానా, కేవీపీ వియ్యంకుడు కావటంతో, జగన్ మోహన్ రెడ్డి, కేవీపీ ద్వారా కూడా వర్తమానం నడిపారు... ఆయన్ను పార్టీలోకి తీసుకోవటానికి, అన్ని విధాల ప్రయత్నం చేసారు... కాని, ఆయన తెలుగుదేశం పార్టీలోనే చేరటానికి నిర్ణయించుకున్నారు.. తెలుగుదేశం పార్టీ మరో పక్క, ఆయనకు ఎంపీ సీట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది..

Advertisements

Advertisements

Latest Articles

Most Read