గాలి జనార్దన్ రెడ్డి... ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు... రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, అక్రమ మైనింగ్ లో, ఒక పీకు పీకాడు... జగన్ సొంత కొడుకు అయితే, గాలి నా పెద్ద కొడుకు అంటూ అప్పట్లో రాజశేఖర్ రెడ్డి చెప్తూ ఉండే వారు... అలాగే, జగన్ లక్ష కోట్లు కొట్టేస్తే, పెద్ద కొడుకు గాలి జనార్ధన్ రెడ్డి కొట్టేసిన అక్రమ మైనింగ్ లెక్క అంతా ఇంతా కాదు.. చివరకు ఇద్దరు కొడుకులు జైలుకు వెళ్లి, ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నాడు అనుకోండి... అయితే, కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న వేళ, గాలి జనార్ధన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చే విధంగా, సిబిఐ ప్రమాణ పత్రాలు ఇచ్చింది.. అది కూడా రహస్యంగా..
అయితే, ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖా దత్, సిబిఐ ప్రమాణ పత్రాలు బయట పెట్టింది... 50 వేల కోట్లు... సాంకేతిక కారణాలతో కేసు కొట్టేసే విధంగా, సిబిఐ ప్రమాణ పత్రం దాఖలు చేసింది... గోవా, కర్ణాటకలో ఎప్పుడు మైనింగ్ చేసారో, ఎలా తరలించారో, చెప్పటం కష్టం అంటూ, సిబిఐ కోర్ట్ కు తెలిపింది... ఇలా చెప్తే, గాలి జనార్ధన్ రెడ్డి పై పెట్టిన కేసు వీగిపోతుంది అని , న్యాయవాదులు అంటున్నారు... అక్రమ మైనింగ్ లో దేశ సహజ సంపదను కొల్లగొట్టిన విషయం తెలిసిందే... అప్పట్లో, సిబిఐ, 50 వేల కోట్ల మేర, అవినీతి జరిగినట్టు నిర్ధారించింది కూడా... మరో పక్క, బెయిల్ ఇచ్చే విషయంలో, జడ్జికి లంచం కూడా ఇవ్వబోయి దొరికిపోయాడు గాలి.. ఇంత ఘన చరిత్ర ఉన్న గాలికి, ఇప్పుడు క్లీన్ చిట్ రానుంది...
కర్ణాటక ఎన్నికలకు ముందే, గాలి జనార్ధన్ రెడ్డికి, తన కేసుల్లో క్లీన్ చిట్ ఇచ్చేందుకు, బీజేపీ పెద్దలు ప్రణాలిక సిద్ధం చేసినట్టు, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు, ఇవి ఊతం ఇస్తున్నాయి... ఎన్నికల ముందు, క్లీన్ ఇమేజ్ ఉంది అని చెప్పుకునే విధంగా, తద్వారా ఓటర్లను ప్రభావితం చెయ్యవచ్చు అనేది ఢిల్లీ పెద్దల ఆలోచన... మరో పక్క, ఇక్కడ గాలి తమ్ముడు అయిన, జగన్ కు కూడా ఇదే భరోసా ఉంది అని తెలుగుదేశం ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది... అందులో భాగంగానే విజయసాయి రెడ్డి, ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నారని ఆరోపించింది... అవసరమైతే, పార్టీని, బీజేపీకి ఇచ్చేయ్యటానికి కూడా జగన్ సిద్ధం అయ్యాడు... ఇలాంటి వారిని దగ్గరకు తీసుకుని, అవినీతి పై యుద్ధం చేస్తా అంటున్నారు మన ప్రధాని...