చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం దాకా, అవినీతి బాగా ఎక్కువ ఉండేది. ఇది చంద్రాబాబు మార్క్ పాలన కాదు అని చాలా మందికి అసంతృప్తి ఉండేది... చంద్రబాబు కూడా ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ ఇచ్చారు... ప్రభుత్వ అధికారులకి ఏమి కావలి అంటే ఇది ఇస్తున్నారు... భారీగా జీతాలు పెరిగినా ఉద్యోగుల్లో అవినీతి మాత్రం తగ్గలేదు... చంద్రబాబు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఉద్యోగులు లెక్క చేయలేదు... దీంతో చంద్రబాబు దీని మీద ఫోకస్ చేశారు... ఎలా అయినా ఈ లంచాల అవినీతిని అరికట్టటానికి ప్రణాలికలు సిద్ధం చేశారు... దాదాపు యుద్ధం ప్రకటించారు.. సమర్థవంతుడైన అధికారిగా పేరున్న ఆర్పీ ఠాకూర్‌ను ఏసీబీ చీఫ్‌గా నియమించారు. దీంతో పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఏసీబీ అధికారులను ఉరుకులు పెట్టించారు.
ఇప్పుడు తాజాగా, ఏకంగా ఒక ఐఏఎస్ కు చెక్ పెట్టాలని, ఏసీబీకు సీఎం ఆదేశించటం చూస్తుంటే, అవినీతి పై చంద్రబాబు ఎంత ఖటినంగా ఉన్నారో అర్ధమవుతుంది. గ్రూప్ వన్ అధికారిగా ప్రభుత్వోద్యోగంలో చేరారు. పదోన్నతి ద్వారా ఐఏఎస్ హోదాని పొందారు. పలు జిల్లాలలో కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మొన్నటివరకూ ఎంతో కీలకమైన పౌరసరఫరాల శాఖలో పనిచేశారు. ఈ క్రమంలో ఆయన సాగించిన అవినీతి లీలలపై గట్టి ఆధారాలు ప్రభుత్వానికి అందాయి. దీంతో ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా సర్కారీ పెద్దలు ఆయనను వెయిటింగ్లో పెట్టారు. 2015 జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ ఆయన ఏపీ పౌరసరఫరాల శాఖలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఆయన హయాంలో ఆ శాఖలో దాదాపు వేల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిగాయి. ప్రభుత్వం సేకరించే కందిపప్పు, పంచదార, బియ్యంతోపాటు సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "చంద్రన్న సంక్రాంతి కానుక'', "చంద్రన్న రంజాన్ తోఫా'', "చంద్రన్న క్రిస్మస్ కానుక''ల కోసం సదరు కొనుగోళ్లు చేశారు. వీటి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శకి పలు ఫిర్యాదులు అందాయి. వీటిపై ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరించింది. సదరు డైనోసార్గారు ఆయా పథకాల పేరు చెప్పి అందినకాడికి మింగేశారని వెల్లడైంది.
ఎడాపెడా దోచేసిన ఈ డైనోసార్ సంగతి తెలుసుకున్న వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. నిఘావర్గాలతో పూర్తి సమాచారం రప్పించుకుందట. మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారట. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించేందుకు అనేక సాంకేతిక పద్ధతులను అమలులోకి తెస్తుంటే... మరోవైపు ఒక అధికారి ఈ స్థాయిలో అవినీతికి పాల్పడటం ఏమిటని ఆయన ఆగ్రహించారట. అంతేకాదు- సదరు అధికారి లీలలపై దర్యాప్తు చేయమని అవినీతి నిరోధకశాఖ అధికారులను సీఎం ఆదేశించారట. ఏసీబీకి కూడా తగిన ఆధారాలు సంపాదించదట. వారి విచారణలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయట. ఇక ముఖ్యమంత్రి ఆదేశమే తరువాయి.. ఏసీబీ అధికారులు ఎప్పుడైనా రంగంలోకి దిగి ఆయన కథ కంచికి చేరుస్తారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.