ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు పడినా, ఆడపిల్లల వేధింపుల విషయంలో మాత్రం మార్పు రావటం లేదు. తాజాగా జరిగిన దాచేపల్లి ఘటనతో, చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘ఆడపిల్లలను వేధించే ఆకతాయిల ఫొటోలను ఇకపై అందరికీ తెలిసేలా ఆన్‌లైన్‌లో ఉంచుతాం. దీని వల్ల వారు చదువుకొనే కళాశాలలో, ఇంటి దగ్గర వారి పరువు పోతుంది. ఈ భయంతో ప్రతి యువకుడి కుటుంబ సభ్యుల్లో జవాబుదారీతనం వస్తుంది. త మ బిడ్డ తప్పుడు దోవ పట్టకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉంటుంది..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది వారి మనస్సుపై తీవ్ర చెడు ప్రభావం చూపుతోందన్నారు. విపరీతమైన మనస్తత్వం ఉన్న వారు ఆ మనోవికారంతో ఆంబోతుల్లా మారి అభం శుభం తెలియని చిన్నారులపై సైతం అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

cbn 06052018

‘ఆడపిల్లలను వేధించే ఆకతాయిల ఫొటోలను ఇకపై అందరికీ తెలిసేలా ఆన్‌లైన్‌లో ఉంచుతాం. దీని వల్ల వారు చదువుకొనే కళాశాలలో, ఇంటి దగ్గర వారి పరువు పోతుంది. ఈ భయంతో ప్రతి యువకుడి కుటుంబ సభ్యుల్లో జవాబుదారీతనం వస్తుంది. త మ బిడ్డ తప్పుడు దోవ పట్టకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉంటుంది..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘‘దాచేపల్లి దురాగతాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కావడానికి వీల్లేదు. ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయన్న భయం ఏర్పడాలి. ఉరిశిక్ష తప్పదన్న భీతి కలగాలి. దానికోసం ఫోక్సో చట్టంలో సవరణల్ని కలెక్టర్లు, ఎస్పీలు విస్తృతంగా ప్రచారం చేయాలి’’ అని ఆయన కోరారు.

cbn 06052018

నిశ్శబ్దాన్ని ఛేదించడం ద్వారా ఎయిడ్స్‌ను నిరోధించామని, లైంగిక వేధింపులనూ అదే తరహాలో ఆడబిడ్డలు ప్రతిఘటించి తమను తాము సబలలుగా నిరూపించుకోవాలని కోరారు. దాచేపల్లి ఘటన నేపథ్యంలో సోమవారం ప్రభుత్వం ‘‘ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం’’ పేరిట రాష్ట్రవ్యాప్త కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పనిలో పనిగా మీడియాకు సీఎం చంద్రబాబు క్లాస్‌ పీకారు. అత్యాచారానికి గురైన బాధితురాలిని ఎలా ఆదుకుంటారని ఒక విలేకరి ప్రశ్నించగా ఆయన తీవ్రంగా స్పందించారు. మీ ప్రశ్నలోనే లోపం ఉంది... మొదట అఘాయిత్యానికి పాల్పడిన దోషికి తగిన శిక్ష పడేలా చర్యలపై ప్రశ్నించాలి... ఆ తర్వాతే బాధితురాలికి సాయం గురించి అడగాలి... అని ఆయన సూచించారు. కశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌లలో బాలిలకపై లైంగికదాడులు జరిగితే అక్కడి ప్రభుత్వాలు సరిగా స్పందించ లేదనీ, దాచేపల్లి సంఘటనలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించిందనీ చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read