తిరుమలలోని దేవాలయాలన్నింటినీ కబ్జా చేయడానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. తిరుమలలో టిటిడి పరిధిలో ఉన్న ఆలయాలన్నింటినీ పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకోవాలని కేంద్రం యోచిస్తున్నది. తిరుమలలో ఉన్న ఆలయాలను, వాటి చరిత్రను పరిశీలించిన కేంద్ర పురావస్తు శాఖ వాటిని పూర్వకాలంలో నిర్మించినవిగా గుర్తించింది. తిరుమలలోని ఆలయాలు, భవనాల వివరాలు అందించాలని పురావస్తు శాఖ టిటిడికి లేఖ రాసింది. ఢిల్లి కేంద్ర కార్యాలయం ఆదేశాలతో రాష్ట్ర పురావస్తు శాఖకు సమాచారం ఇచ్చారు. తిరుమలలో పురాతన కట్టడాలకు రక్షణ కరువైందని, పురాతన కట్టడాలు తొలగించి, కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని పలు ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్ర పురావస్తు శాఖ, ఒక సాకుగా చూపించి, ఈ కుట్రకు తెర లేపింది.
కేంద్ర పురావస్తు శాఖ అధికారులు తిరుమలను సందర్శించనున్నారు. టిటిడినుంచి కట్టడాల జాబితా అందిన తరువాత అధికారులు తిరుమలను సందర్శించే అవకాశం ఉంది. పరిశీలన అనంతరం దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తిరుమలలోని ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ ఆలయాలపై ఎలాంటి అధికారం ఉండదు. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని కేంద్రం తీసుకునే అవకాశముంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లను నామినేట్ చేసే అధికారం కూడా రాష్ట్రానికి లేకుండా పోతుంది. ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ లోని, స్వామిజీలు మండిపడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం పై కక్ష సాధింపుగా భావిస్తున్నారు..
మా తిరుపతి పై నీ పెత్తనం ఏమిటి మోడి అంటూ ఆందోళనకు సిద్దమవుతున్నారు.. తీవ్ర పర్యవసానాలు వుంటాయని ప్రజలు హెచ్చరిక చేస్తున్నారు... మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయాం.. మద్రాసు పోయినా తిరుమల ఉందని సంతోషించాం.హైదరాబాద్ పోయింది.తిరుమల ఉందని ఊపిరి నిలుపుకున్నాము.తిరుమల జోలికి రావద్దు. తిరుమల మాదే, ఏడుకొండలు మావే ! వెంకటేశ్వరుడు మా దేవుడే !! ఇందులో ఎలాంటి డౌటు లేదు. అనవసర ప్రయాసలు మానుకోండి!! అసలే ఆంధ్రులు అసంతృప్తి చూసి వెంకన్న ఆగ్రహంతో ఉన్నాడు. పొరపాటు జరిగిందో ఇక మీకు శంకరిగిరి మాన్యాలే గతి !!