తిరుమల సహా, మిగతా ఆలయాలును పురావస్తుశాఖ ద్వారా, కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటాయని వచ్చిన వార్తల నేపధ్యంలో, రాష్ట్రంలో ఒకేసారి అలజడి రేగింది.. ఈ ఉత్తర్వులు చూసి అందరూ ఆశ్చర్యపోయారు.. మోడీ, మన రాష్ట్రం పై ఇలా కక్ష తీర్చుకుంటున్నారని, ఇది చాలా తప్పని, వెంకన్నతో పెట్టుకోవద్దు అని, అలా పెట్టుకున్న వాళ్ళు ఏమైయ్యారో తెలుసుకోవాలని, ప్రజలు శాపనార్ధాలు పెట్టారు... ఈ ఉత్తర్వులు వచ్చిన అరగంటలోనే వెంకన్న తన పవర్ చూపించారు.. కేవలం అరగంటలో, కేంద్రం వెనక్కు తగ్గింది.. సమాచార లోపంతో ఉత్తర్వులు జారీ చేశామని.. ఈవో సింఘాల్ కు వివరణ ఇచ్చిన పురావస్తు శాఖ. ఆ వెంటనే ఆ ఆదేశాలు వెనక్కు తీసుకుంటున్నామని, మరో ఉత్తరం పంపించింది..

ttd 05052018

"With reference to the above cited subject, this is to inform you that the letter issued inadvertently has been withdrawn and hence may be treated as cacnelled" ఇది ఆ లెటర్ సారంశం... మరో పక్క ఈ విషయం రాగానే, తిరుమలలోని ఆలయాలను పురావస్తుశాఖకు అప్పగించాలనే ఆలోచన టీటీడీకి లేదని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. అసలు ఇలాంటి ఉత్తర్వులు ఏంటి అని, గట్టిగా పురావస్తు శాఖ అధికారులని అడిగారు.. దీంతో, ఈ లేఖ రాష్ట్రం పెను ప్రకంపనలు రేపటం, ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రావటంతో, వెనక్కు తాగ్గుతున్నట్టు మరో లెటర్ రాసారు.

ttd 05052018

అయితే ఒక్కసారి ఈ ఆలోచన వస్తే, ఎప్పటికైనా కేంద్రం ఈ విషయం పై మళ్ళీ రాష్ట్రం మీదకు వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి ఎట్టి పరిస్థితిలోను, కేంద్రానికి ఆ అవకాసం ఇవ్వ కూడదు అని అంటున్నారు.. ప్రస్తుతం ప్రజా ఆగ్రహం చూసి వెనక్కు తగ్గారని, తిరుపతి పై వీరు కన్ను పడింది అని, జాగ్రత్తగా ఉండాలని, స్వామీజీలు కూడా అంటున్నారు. అయినా వారు రాసిన ఉత్తరంలో చాలా స్పష్టంగా కుట్ర దాగి ఉంటే, మళ్ళీ సమాచార లోపం అని చెప్పటం సిగ్గు చేటు అని అంటున్నారు... ఇది రాష్ట్రాన్ని కబళించే కుట్రలో ఒక భాగం అని, ఇలాంటి పరిస్థితులు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలని అంటున్నారు.. అయినా వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా, వెంకన్నకు ఏమి చెయ్యాలో తెలియదా ? ఆయనే చూసుకుంటాడు..

Advertisements

Advertisements

Latest Articles

Most Read