మనిషి దగా మనసు దగా... ముందు దగా వెనుక దగా... అడుగడుగునా దగాదగా... అచ్చేదిన్ అతి పెద్ద దగా... వీళ్లా అవినీతిని రూపు మాపేది ??వీళ్లా నల్ల ధనాన్ని వెనక్కు తెచ్చేది ?? వీళ్లా అవినీతి పరుల భరతం పట్టేది ?? అతి తీవ్రమైన ఆర్ధిక నేరాలలో ,అవినీతి కేసులలో నిందితుడి గా వున్న గాలి జనార్ధన రెడ్డి సన్నిహితులందరికి కర్ణాటక ఎలక్షన్స్ లో బీజేపీ టికెట్స్ .. అంతే కాదు, ఈ రోజు ఏకంగా, గాలి జనార్ధన్ రెడ్డి, బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గుని సంచలనం సృష్టించారు... జైలు నుంచి వచ్చిన తరువాత, మొదటిసారి బీజేపీ నాయకులతో ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ల ఆశీర్వాదం తీసుకున్న గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని బీజేపీ అవినీతి పై పోరాటం చేస్తుంది అనే వారికి ఝలక్ ఇచ్చారు.
బీఎస్. యడ్యూరప్పను చూసిన వెంటనే గాలి జనార్దన్ రెడ్డి ఆయనకు పాదాబివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. నిత్యం నవ్వుతూ ఉండే యడ్యూరప్ప గాలి జనార్దన్ రెడ్డిని చూసిన వెంటనే మరికొంచెం ఎక్కువగా నవ్వుతూ ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. యడ్యూరప్పతో మాట్లాడిన తరువాత పక్కనే ఉన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు పాదాబివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్న గాలి జనార్దన్ రెడ్డి తరువాత శ్రీరాములు నామినేషన్ సందర్బంగా బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు.
అవినీతి పరులకు శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం ఇవ్వమని, గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీ ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పడంతో అందరూ నిజమే అనుకున్నారు... కాని ఈ రోజుతో, విషయం ప్రజలకు తెలిసిపోయింది. ఒక పక్క, నరేంద్ర మోడీ, అవినీతి పై యుద్ధం అంటూ దేశం అంతా తిరిగి చెప్తూ, 42 నెలల పాటు జైలులో ఉండి వచ్చిన వ్యక్తిని, తన పార్టీ తరుపున పోటీ చేసే అవకాశం ఇస్తున్నారని తెలియటంతో, దేశ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు... గతంలో జనార్ధన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. అప్పట్లో బీజేపీ తరఫున ఎమ్మెల్సీ హోదాతో గాలి జనార్ధన్ రెడ్డి మంత్రి పదవిని చేపట్టారు... అయితే ఇలాంటి సీన్ త్వరలో మన రాష్ట్రంలో కూడా చూడబోతున్నాం... ఒక పక్క మోడీ, అటు పక్క జగన్, ఇటు పక్క పవన్ తో, జూన్ నెలలోనే, ఈ దృశ్యం ఆవిష్కృతం కానుంది.