టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్‌గా తన నియామకాన్ని వెనక్కు తీసుకోవాలంటూ సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తన కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడం ఇష్టం లేదని లేఖలో రాశారు. తాను హిందువునని, తన ఇష్టదైవం వేంకటేశ్వర స్వామి అని ఆమె స్పష్టం చేశారు. తాను అనేకసార్లు తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నానని చెప్పారు. తాను క్రిష్టియన్‌ను కాదన్నారు. టీటీడీ మెంబర్‌గా అనితను నియమించిన వెంటనే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అనిత తనను తాను క్రిష్టియన్ అని ఆ వీడియోల్లో ప్రకటించుకున్నట్లు ఉంది.
తాను దేవుడిని నమ్ముతానని, తన బ్యాగ్‌లో, కారులో బైబిల్ ఉంటుందని అనిత చెప్పినట్లు వీడియోలో ఉంది. దీంతో దుమారం రేగింది. అయితే, తాను హిందువునేనంటూ అనిత ముందుకు వచ్చారు. తన కులం సర్టిఫికెట్ కూడా చూపించారు. తాను అన్ని మతాల విశ్వాసాలను పాటిస్తానని చెప్పారు. అయినా సరే ఇది రాజకీయ వివాదంగా మారడంతో ఆమె మనస్తాపం చెందారు. దీంతో తనను టీటీడీ సభ్యురాలి పదవి నుంచి తొలగించాలంటూ సీఎం చంద్రబాబునాయుడుకి లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం ఆమెను బోర్డు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది... విపక్షాలు ఈ నిర్ణయంతో షాక్ తిన్నాయి... ఈ విషయంలో చంద్రబాబుని రాజకీయంగా ఆడుకోవచ్చు అని భావించారు...
ఇది అనిత లేఖ సారంశం... నా మీద నమ్మకం తో దళిత మహిళని అయిన నన్ను నా ఇష్ట దేవమైన వెంకటేశ్వర స్వామి సేవ చేసుకొనే అవకాశం టీటీడీ బోర్డు మెంబెర్ గా నిమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటున్న. కానీ కొన్ని దుష్ట శక్తులు నా మీద నేను నమ్మే మతం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను హిందువు ని అయినప్పటికీ కట్ పేస్ట్ చేసిన వీడియో ని సోషల్ మీడియా లో పెట్టి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారు...ఈ దరిమిలా...నా నాయకుడు ఐన చంద్రబాబు నాయుడు గారిని ఎమి చేయలేక 14 సెకెనుల వీడియో ని చూపించి గవర్నమెంట్ ని సీఎం గారిని తప్పు పట్టడం చేస్తున్నారు. అందువలన నేనే ఈ టీటీడీ బోర్డు మెంబెర్ గా తప్పుకుంటున్నానని వినమ్రతతో తెలియచేస్తున్నా.నన్ను ఎంతో అభిమానించి ఆదరించి నాకు ఎంతోమానసిక ధాయిర్యాన్ని ఇచిన నా తెలుగు దేశం కార్యకర్తలకి నా పాదాభివందనములు తెలియచేసుకుంటూ ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం కోరుకుంటూ మీ సహోదరి అనిత