ముఖ్యమంత్రితో ఉన్న వైరం పక్కన పెట్టి మరీ, విజయవాడ వచ్చి, చంద్రబాబుని కలిసారు గవర్నర్ నరసింహన్... నిజానికి గవర్నర్ ఈ రోజు వైజాగ్ పర్యటన ముగించుకుని హైదరబాద్ వెళ్ళిపోవాల్సి ఉంది. అయితే, ఈ రోజు చంద్రబాబు అప్పాయింట్మెంట్ అడిగి, విజయవాడ వచ్చారు... ఫ్లైట్ లో కాకుండా, వైజాగ్ నుంచి ట్రైన్ లో వచ్చారు... గవర్నర్ ఎందుకు వస్తున్నారో అని అందరూ అనుకున్నారు... కేంద్రం నుంచి రాయబారం ఏమన్నా తెస్తున్నారేమో అనే గుసగుసలు వినిపించాయి... ఈ రోజు ఉదయం 11 గంటలకు చంద్రబాబుని కలిసారు గవర్నర్... మర్యాద పూర్వక మీటింగ్ అని చెప్పినా, కేంద్రం నుంచి తీసుకువచ్చిన రాయబారం చంద్రబాబుకు చెప్పారు.. సుమారు గంటన్నర సేపు వారు మాట్లాడుకున్నారు.
ముఖ్యంగా కర్ణటక ఎన్నికలు అయ్యే వరకు, కేంద్రం పై దూకుడు తగ్గించమని, గవర్నర్ కోరినట్టు సమాచారం... చంద్రబాబు విమర్శలు దాడి, కేంద్రంలోని పెద్దలు తట్టుకోలేకపోతున్నారు అని, చంద్రబాబు దీక్ష జాతీయ స్థాయులో చర్చ కావటం, 30వ తారీఖు చంద్రబాబు తిరుపతిలో పెట్టే సభ, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం పై జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నాయకులతో మోడీకి లెటర్ రాయాలి అనుకోవటం వంటివి, కర్నాటక ఎన్నికల పై ప్రభావం పాడుతాయని, ఇప్పుడిప్పుడే అక్కడ బీజేపీ పరిస్థితి మెరుగు పడుతుంది అని, కేంద్రం పై దాడి తగ్గించమని, గవర్నర్ చంద్రబాబుని కోరినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ టార్గెట్ గా చంద్రబాబు విమర్ళలు చేయడం సరికాదనే అభిప్రాయాన్ని గవర్నర్ చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.
అయితే దీని పై చంద్రబాబు ఘాటుగా సమాధానం చెప్పారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విభజన హామీలు అమలు చేయకపోవడం, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తోందని, హోదాతోపాటు ఏపీకి ఇవ్వాల్సిన 18 అంశాలను కేంద్రం అమలు చేయలేదని, ఇక్కడ కొన్ని పార్టీలతో నాటకాలు ఆడిస్తుందని, ప్రజల అభిప్రాయం మేరకే నేను నడుచుకుంటున్నా అని, ఎక్కడా రాజకీయాలు చెయ్యటం లేదు అని, మాకు మా సమస్యల కంటే ఏది ముఖ్యం కాదని చంద్రబాబు తెగేసి చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సాధించుకునే విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, పోరాటం ఆపేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. చంద్రబాబు చేసిన దీక్షా ప్రభావం కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాపై పడినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని ఒక ముఖ్యమంత్రి 12 గంటలపాటు నిరాహారదీక్ష చేయడం దేశవ్యాప్తంగా సంచలన వార్తగా నిలిచింది. ఈ ప్రభావం కర్నాటక ఎన్నికలపై కూడా పడుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలన్న అభిప్రాయంతో చంద్రబాబు ఉన్న నేపథ్యంలో అటు కేంద్రం, ఇటు కర్నాటక ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ చర్చ జరుగుతోంది.