జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ అభిమానులు రెచ్చిపోయారు. ఫిలింనగర్‌లోని ఫిలించాంబర్‌ వద్ద విధ్వంసం సృష్టించారు. ఫిలిం చాంబర్‌ అద్దాలు పగులగొట్టారు. మీడియాపై దాడి చేశారు. మీడియా వాహనాలు, ఏబీఎన్‌ ఓబీ వ్యాన్‌, కారును ధ్వంసం చేశారు. మరికొన్ని వాహనాలపై పెద్ద పెద్ద బండ రాళ్లు రువ్వారు. వాటిలో ఉన్న జర్నలిస్టులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఇది ఒక పధకం ప్రకారం జరిగినట్టు సిసి కెమెరా దృశ్యాలు పట్టించాయి... ముఖానికి కర్ఛీ్‌ఫలు కట్టుకుని, ఒక్కొక్కరు రెండు షర్ట్‌లను ధరించి మీడియా వాహనాలపై రాళ్లు రువ్వారు... దాడి చేసి, లోపలకు వెళ్లి, మరో చొక్కా ధరించి, మళ్ళీ వచ్చి దాడి చేసారు... దీంతో ఇది ఒక కుట్ర ప్రకారమే జరిగినట్టు అర్ధమవుతుంది... గురువారం అర్ధరాత్రి నుంచి పవన్‌ కల్యాణ్‌ తన ట్విటర్లో చేసిన ట్వీట్లు ఈ విధ్వంసానికి కారణం...

abn 21042018 2

కేసు నమోది చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి, పవన్‌కళ్యాణ్‌ అభిమానులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో భానుప్రసాద్‌ (ఉప్పల్‌) సాయి కిరణ్‌రెడ్డి (రామంతపూర్‌), హరిక అష్ణారెడ్డి (చైతన్యపురి), అంబటి గోపి ఫణీంద్ర (కూకట్‌పల్లి), కంటిపూడి రామ‌కృష్ణ‌ (కూకట్‌పల్లి) ఉన్నారు. మరో పక్క మీడియా పై దాడిని, ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, నిర్మాత జీవిత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఖండించారు. మీడియా వాహనాలపై దాడి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఓబీ వ్యాన్‌, జర్నలిస్టులపై దాడిని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే ప్రతినిధి క్రాంతి ఖండించారు.

abn 21042018 3

నిన్న ఉదయం పవన్‌తోపాటే ఆయన అభిమానులు కూడా వందల సంఖ్యలో ఫిలిం చాంబర్‌కు చేరుకున్నారు. ఆయన ఫిలిం చాంబర్లో చర్చలు జరుపుతుండగానే, కొంతమంది ముఖానికి కర్ఛీ్‌ఫలు కట్టుకుని, కొన్ని మీడియా సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆవేశంగా బయటకు వచ్చారు. మీడియా వాహనాలపై దాడి చేశారు. అభిమానులు మీడియా వాహనాలను ధ్వంసం చేసిన పది నిమిషాలకు పవన్‌ కల్యాణ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మీడియా వాహనాలను ధ్వంసం చేసిన ఇద్దరిని పట్టుకుని ఏబీఎన్‌ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read