రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దీక్ష పై షడ్యుల్ విడుదల అయ్యింది... ఉదయం 9 గంటలకు దీక్ష మొదలవుతుంది. దీక్ష ముగిశాక అదే రోజు సాయంత్రం మున్సిపల్ స్టేడియంలోనే తెదేపా-దళితతేజం విజయోత్సవ సభను నిర్వహిస్తారు. తొలుత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా దళితతేజం విజయోత్సవ సభ నిర్వహించాలన్నా... చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర విభజన జరిగిన పరిస్థితులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా భాజపాతో పొత్తు పెట్టుకోవడం మొదలు తాజా రాజకీయ పరిణామాల వరకు ఆయన సుదీర్ఘంగా వివరించారు.
విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధన కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ నెల 20న నిరాహార దీక్ష చేస్తున్నట్టు తెలిపారు. అదేరోజు నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మండల కేంద్రాల్లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు నిర్వహిస్తారు. ప్రతి గ్రామం నుంచి కనీసం ఐదుగురు ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ‘నమ్మకద్రోహం-కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం’ పేరుతో ఏప్రిల్ 30న తిరుపతిలో జరిగే భారీ బహిరంగ సభకు టిడిపి కార్యవర్గం అంతా హాజరు కావాలని నిర్ణయించారు.ప్రత్యేక హోదాపై నిరసన దీక్షల నేపథ్యంలో ఏప్రిల్ 20న జరగాల్సిన ‘దళిత తేజం-తెలుగుదేశం’ కార్యక్రమం ముగింపు సభను వాయిదా వేశారు.దళిత తేజం తరహాలోనే మైనారిటీ సెల్ సదస్సులు కూడా విజయవంతంగా నిర్వహించాలని కోరారు.
అలాగే, ఈ నెల 21నుంచి ప్రతి నియోజకవర్గంలో సైకిల్ యాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు... పదిహేను నుంచి ఇరవై రోజులపాటు అన్ని గ్రామాలలో టిడిపి సైకిల్ యాత్రలు, నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభలు జరపాలని నిర్ణయించారు... మన సైకిల్ యాత్రలు ప్రజల్లో కదలిక తీసుకురావాలి, జనంలో ఒక ఊపు రావాలి... కేంద్రం చేస్తున్న అన్యాయమే కాదు, వారు సహకరించక పోయినా, ఈ నాలుగేళ్లలో మనమ చేసిన అభివృద్ధి చెప్పాలి, సాధించిన విజయాలు వివరించాలి, హక్కుల కోసం చేస్తున్న పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటూ చంద్రబాబు చెప్పారు... పనులు చేయడం ఎంత ముఖ్యమో, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం అంతే ముఖ్యం అని చంద్రబాబు అన్నారు... ఏపిలో అభివృద్ధి అద్భుతంగా ఉందని తమిళనాడులో ప్రచారం జరుగుతోందని, చరిత్రలో గతంలో జరగని అభివృద్ది ఈ నాలుగేళ్లలో చేశామని, ఆ మోతాదులో వాటిగురించి జనంలో నమోదు చేయలేక పోయామని, ఇప్పటికైనా సైకిల్ యాత్రలను సద్వినియోగం చేసుకుని, ప్రచారం చెయ్యాలని చంద్రబాబు చెప్పారు...