జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి గురించి అందరికీ తెలిసిందే... ఏది ఎందుకు మొదలు పెడతాడో తెలియదు, ఎందుకు ఆపేస్తాడో తెలియదు... ఇదే కోవలో, జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అని వేసి, కేంద్రం ఇంత ఇవ్వాలి అని తేల్చారు.. కాని, తరువాత నుంచి కేంద్రాన్ని ఒక్క మాట అనటానికి కూడా సాహసించటం లేదు.. ఈ వ్యవహారంతో చిర్రెత్తిన లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారయణ కూడా, పవన్ మీద నమ్మకం లేక, సొంతగా ఒక కమిటీ వేసుకుని, కేంద్రం చేస్తున్న అన్యాయం పై పోరాడుతున్నారు... పవన్ వ్యవహార శైలికి కారణం, బీజేపీతో పవన్ చేసుకున్న ఒప్పందమే అని విశ్లేషకులు అంటున్నారు.. మోడీని ఒక్క మాట కూడా అనకపోవటం, నేషనల్ మీడియాకు ఎక్కి, మోడీ నాకు ఆదర్శం అని చెప్పి, చంద్రబాబుని తిట్టటం, ఈ ఆరోపణలకు బలం చేకూర్చాయి...అయితే, ఇప్పుడు పవన్ చేసిన మరో పని చర్చనీయంసం అయ్యింది...
ఈ నెల 16న అనంతపురం జిల్లలో పవన్ పర్యటన అని, అక్కడ ప్రత్యెక హోదా పై, ఆందోళన చేస్తారు అంటూ, హడావిడి చేసారు... పవనే స్వయంగా ఈ విషయం కూడా చెప్పారు.. అయితే, చివరి నిమిషంలో పర్యటన రద్దు అయ్యింది. ఎడమ కంటికి కొద్దిపాటి డస్ట్ ఇన్‌ఫెక్షన్ కారణంగా పర్యటన రద్దు చేసుకున్నట్టు జనసేన కార్యాలయం లీక్ ఇచ్చింది... అయితే, ఆ ముందు రోజు ఎదో సినిమా ఫంక్షన్ కి వెళ్ళటం, ఆ తరువాత రోజు హైదరాబాద్ లో అసిఫాకు మద్దతుగా దీక్ష అంటూ, ఒక గంట హడావిడి చేసారు పవన్... అయితే తరువాత రోజు చెయ్యాల్సిన అనంత పర్యటన మాత్రం వాయిదా పడింది... కొద్దిపాటి ఇన్ఫెక్షన్ కే, పర్యటన వాయిదా వేసేంత బలహీనుడు అయితే పవన్ కాదని, దీని వెనుక ఎదో బలమైన కారణం ఉంది అని అంటున్నారు... దీనికి బలం చేకూరుస్తూ మరో, నిర్ణయం తీసుకున్నాడు , పవన్...
15న అనంతపురం, 24న ఒంగోలు, మే 6న విజయనగరంలో పట్టణాల్లో నిర్వహించ తలపెట్టిన, మేధావులతో సమావేశాలని కూడా రద్దు చేసారు... ఇది కూడా పవనే ప్రకటించారు... హోదా పై, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు అంటూ చెప్పి, అన్ని కార్యక్రమాలనూ నిలిపివేసినట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. రైతు, కార్మికుల సమస్యలపై పోరాటానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని పవన్ చెప్పారు... ప్రత్యేక హోదా సాధన కోసం, ఎవరైనా, ఏ కార్యక్రమానికైనా చేస్తే తాము మద్దతిస్తామని అన్నారు.. ఇవన్నీ చూస్తుంటే, బీజేపీ నుంచి ఆదేశాలు రావటంతో, ఇక హోదా పై పవన్ పోరాటం ఆగిపోయినట్టే అని అనుకుంటున్నారు... బీజేపీ సూచనల మేరకు, ఇక హోదా పై కాకుండా, కేంద్రాన్ని ఇబ్బంది పెట్టకుండా, రాష్ట్రంలో సమస్యల పై, చంద్రబాబు పై పోరాటానికి పవన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది... లేకపోతే, కామెడీ కాకపొతే, చిన్న ఇన్ఫెక్షన్ వస్తే, పోరాట యోధులం అని చెప్పుకునే వారు, వారం రోజులు ఇంట్లో కూర్చుంటారా ? అంతా ఢిల్లీ మహిమ...