రాజకీయంగా ఆపరేషన్ గరుడ, ఇప్పటికే మొదలైపోయింది... అయితే, విధ్వంసం సృష్టించి, రాష్ట్రంలో అనిశ్చితికి ప్లాన్ చేసిన సంగతి కూడా తెలిసిందే... అయితే, నిన్న బంద్ సందర్భంగా భారీ విధ్వంసం ప్లాన్ చేసారా అనే అనుమానాలు కలుగుతున్నాయి... సిసి టీవీ ఫుటేజీలను చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు... ప్రశాంతంగా జరుగుతున్న ‘ప్రత్యేక హోదా’లో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నించారంటూ నలుగురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘హోదా బంద్‌ హింసాత్మకం... బైక్‌ను తగలబెట్టిన ఆందోళనకారులు... ఉద్రిక్తత’ అనే కలరింగ్‌ ఇచ్చేందుకు తమంతట తామే ఒక డొక్కు బైక్‌ను తీసుకొచ్చి, దానికి నిప్పంటించారని పోలీసులు తెలిపారు. తిరుపతి ఈస్ట్‌ డీఎస్పీ మునిరామయ్య తెలిపిన ప్రకారం... సోమవారం బంద్‌ సందర్భంగా తిరుపతి బస్టాండ్‌ సమీపంలో ఓ ద్విచక్ర వాహనానికి నిప్పంటించారు. ఇది పార్టీలు, లేదా సంఘాల ఆందోళనలో భాగంగా కాకుండా... అల్లర్లు, హింసను ప్రేరేపించేలా జరిగింది. బస్టాండు సమీపంలో బైక్‌ తగలబడటంతో జనం ఆందోళనకు గురయ్యారు.

yco 17042018

దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు ఆ బైక్‌ను తోసుకుంటూ వచ్చి... అక్కడ నిలిపి తగలబెట్టినట్లు గుర్తించారు. వారిని వైసీపీ కార్యకర్తలుగా గుర్తించారు. అజయ్‌కుమార్‌, రాజు, మురళి, ఉదయ్‌ వంశీ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇటీవల వైసీపీ నిర్వహించిన హైవేల దిగ్బంధం సందర్భంగానే బైక్‌ను తగలబెట్టాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో తేలింది. రూ.3500 చెల్లించి ఒక పనికిరాని బైక్‌ను మెకానిక్‌ నుంచి కొనుగోలు చేశారు. సోమవారం వ్యూహాత్మకంగా తగులబెట్టారు.

yco 17042018

తమ కార్యకర్తలను అరెస్టు చేయడంపై వైసీపీ శ్రేణులు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగాయి. అరెస్ట్‌ చేసినవారిని వెంటనే విడుదల చేయాలని వీరు డిమాండ్‌ చేశారు. ‘వ్యూహాత్మక విధ్వంసం’ సృష్టించేందుకే ఇలా చేశారని, సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారాలున్నాయని, ధర్నా విరమించకుంటే అందరిపైనా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దీంతో... వారంతా వెనక్కి తగ్గారు. తిరుపతిలో పనికట్టుకుని విధ్వంసం సృష్టించే ప్రయత్నం జరిగిందని పోలీసు అధికారులు అమరావతిలో కేబినెట్‌ భేటీలో వెల్లడించారు. తునిలో రైలు నుంచి ఇప్పుడు మోటార్‌ సైకిల్‌ దహనం వరకూ అన్నీ వ్యూహాత్మకంగా జరిగినవేనని, ఉద్యమాల చాటున అశాంతి సృష్టించే ప్రయత్నం జరుగుతోందని సీఎం అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read