సరిగ్గా నెల రోజుల క్రితం మార్చ్ 13న, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్యకు ఒక లేఖ రాసారు... తనకు భద్రత కావాలని, గతంలో తెలుగురాష్ట్రాల్లో కొన్ని సభలు నిర్వహించినప్పుడు భద్రత సమస్య తలెత్తిందని అన్నారు. తనపై దాడి జరిగితే ప్రజా జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని, తనపై దాడి జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ, లేఖ రాసారు... అసలు, ఈ పదాలు ఎంతటి ఖటినమైన పదాలో చూడండి... "తనపై దాడి జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి" అంటూ తన అభిమానులని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి, ఎదో జరిగిపోతున్నట్టు సృష్టించి, ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేసారు... అయినా, చంద్రబాబు ప్రభుత్వం, ఇవేమీ పట్టించుకుండా, పవన్ కోరిన విధంగా బధ్రత ఇచ్చింది...
2+2 గన్‌మెన్లను పవన్ కల్యాణ్ కు భద్రత కల్పించటానికి ప్రభుత్వం కేటాయించింది... మళ్ళీ ఇతగాడు ఉండేది హైదరబాద్ లో, అయినా సరే, బాధ్యతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే, పవన్ అడిగిన మేరకు సెక్యూరిటీ కేటాయించింది... మనోడు, ఇలాంటి రాజకీయాలు కెసిఆర్ తో తాడితే, తాట తీస్తాడు కాబట్టి, చంద్రబాబుతోనే ఇలాంటి వేశాలు వేస్తాడు... సరే, మొత్తానికి, ఇలా సెక్యూరిటీ ఇచ్చి నెల రోజులు అయ్యింది.. నెల రోజులు ఎక్కడికి వచ్చినా, పక్కన గన్‌మెన్లను పెట్టుకుని తిరిగాడు పవన్... మళ్ళీ ఏమైందో ఏమో, ఈ రోజు సెక్యూరిటీని వెనక్కి పంపింసినట్టు మీడియాకు లీకులు ఇచ్చారు. తనకు భద్రతగా ఉన్న సెక్యూరిటీని [పవన్, వెనక్కి పంపించారని మీడియాకు చెప్పారు. తనకు ఏపీ ప్రభుత్వం కల్పించిన భద్రత సిబ్బంది వద్దని స్పష్టం చేసినట్టు చెప్పారు.
నిన్న రాత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వెంటనే ఏపీ హోంశాఖకు లేఖ ద్వారా తెలియజేస్తూ.. వారిని విజయవాడ కమిషనర్ ఆఫీస్ కు పంపించారు. ఇన్నాళ్లు భద్రత కల్పించిన సెక్యూరిటీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. పవన్ కల్యాణ్ తన భద్రతా సిబ్బందిని వెనక్కి పంపించటం వెనక తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ కు ఏపీ ప్రభుత్వం భారీ బందోబస్త్ ఇచ్చింది. అప్పట్లో ఇది చాలా పెద్ద బ్రేకింగ్ కూడా అయ్యింది. అయితే, జనసేన ఇస్తున్న లీకులు ప్రకారం, ప్రభుత్వం వారి చేత నిఘా పెట్టించింది అని, పార్టీ కార్యకలాపాలు లీక్ అవుతున్నాయనే ఉద్దేశ్యంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకొన్నారని చెప్తున్నారు. అయినా, ఈ వాదన చాలా వింతగా ఉంది. ఇలా ఆలోచిస్తే, అసలు జగన్ ఏమైపోవాలి ? ఈ దేశంలో ఉన్న విపక్ష నాయకులు ఏమైపోవాలి ? కేంద్ర ఆధీనంలో ఉండే బ్లాక్ కాట్స్ బద్రత ఉన్న చంద్రబాబు ఏమైపోవాలి ? తన పార్టీలో ఉండే ఎవరో ఎదో లీక్ చేస్తుంటే, అది సెక్యూరిటీ మీదకు నెట్టి, ప్రభుత్వాన్ని ప్రతి సందర్భంలో అప్రతిష్ట పాలు చెయ్యటం ఈయనకు అలవాటే... అదేమంటే, ఎవరో ఎదో అనుకుంటున్నారు, నేను చెప్పను అంటాడు... ఈయనగారి మీద అందరూ అనుకునేయి చెప్తే, ఏమైపోతాడో.. అయినా, నెల రోజుల క్రితం నాకు ఎదో ప్రమాదం జరిగిపోతుంది, బద్రత కావలి అని హడావిడి చేసి, ఇప్పుడు ఈ మెలోడ్రామా ఎందుకు ? దేని మీద నిలకడ ఉండదా ?