ఈ రోజు, రాష్ట్రపతి దగ్గరకు, వైసిపీ ఎంపీలు వెళ్లారు.. లోపల ఏమి జరిగిందో తెలియదు కాని, ఒక ఫోటో బయటకు వదిలారు... ఈ ఎంపీలు బయటకు వచ్చి, మీడియా ముందు, రెచ్చిపోయారు... మోడీ మీద కాదులే అండి, చంద్రబాబు మీద... రాష్ట్రపతి నివాసానికి మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, వైఎస్ అవినాష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్లారు... ఆయనకు ఒక లెటర్ ఇచ్చి వచ్చారు... ఆ లెటర్ మీడియాకు విడుదల చేసారు... ఎక్కడా, ప్రధాని మోడీ, హోదా ఇవ్వటం లేదు అని కాని, విభజన హామీలు నెరవేర్చటం లేదు అని కాని, ఒక్క ముక్క కూడా లేదు... చాలా జాగ్రత్తగా పద్దతిగా లెటర్ రాసి, వీలు ఉన్న ప్రతి చోట, చంద్రబాబుని తిట్టారు... అంతటితో అయిపోలేదు అండి... అసలు స్టొరీ ఇదే..
జగన్ రెడ్డి లేటెస్ట్ లెటర్ హెడ్ చూడండి. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఇంకా హైదరాబాదులోనే ఉందంట సారువాడికి. రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్ళయినా ఇప్పటికీ హైదరాబాదు వదిలి రాలేదు. కనీసపు అనుబంధం కూడా లేదు ఈ రాష్ట్రంతో, రాష్ట్ర ప్రజలతో. పైగా, సిగ్గు లేకుండా, అమరావతిని, భ్రమరావతి అంటూ ఎగతాళి చేస్తాడు... ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, అమరావతి వచ్చి రెండు ఏళ్ళు అవుతుంది... కాని సారు గారికి, ఇంకా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హైదరాబాద్ లోనే ఉంది... ఇలాంటి వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్ష నాయకుడు... మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం కోసం, పోరాడుతున్నాడు... కాని, అమరావతి అనే మాట పలకటానికి కూడా ఇబ్బంది... కనీసం లెటర్ హెడ్ లో, రెండేళ్ళు అవుతున్నా, అమరావతి అని రాసుకోలేదు అంటే, అమరావతి అంటే, మనోడికి ఎంత చిరాకో చూడండి...
కానీ ఈయన గారు చెప్పే బూటకపు విలువల గురించి విని ప్రజలు ఓట్లేయాలి... సామీ, సిఎం అయితే తప్ప ఈ రాష్ట్రంలో నివసించను అనుకునేవాడిని జనమెందుకు ఆదరించాలి ? సమాధానం చెప్పగలవా ? ఇంకో కామెడీ ఏంటి అంటే, ఈ ఎంపీలు రాజీనామా చేసి, 15 రోజులు అవుతుంది.. ఇప్పటి వరకు రాజీనామాలు ఆమోదించోకో లేదు.. రాష్ట్రపతిని కలిసి ఎలా విన్నవించారో, అలాగే స్పీకర్ దగ్గరకు వెళ్లి, రాజీనామాలు ఆమోదించుకోవచ్చుగా... మీరు చేసినవి నిజమైన రాజీనామాలు అయితే, అవి ఆమోదించుకుని, ఆంధ్రప్రదేశ్ రావాలి.. కాని, మనం చేసేవి డ్రామాలు... రాష్ట్రం మీద ప్రేమ ఉండదు... అమరావతి మీద ప్రేమ ఉండదు... కేవలం ముఖ్యమంత్రి పీఠం మీదే ఆరాటం...