ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి సీఎం చంద్రబాబు ‘ధర్మ పోరాట దీక్ష’... ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన దీక్షకు ‘ధర్మ పోరాట దీక్ష’ అని పేరు పెట్టారు. తన పుట్టిన రోజైన ఈనెల 20వ తేదీన బాబు దీక్ష చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 12 గంటలపాటు నిరశన దీక్ష చేస్తారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి సుమారు 150 మంది చంద్రబాబుతో దీక్షలో పాల్గొంటారు. స్టేడియంలో 10 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తారు. 68ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేపడుతున్న ఈ దీక్షకు ప్రజలంతా మద్దతివ్వాలని ప్రభుత్వం కోరింది. 68 ఏళ్ల వయసులో కూడా తన పుట్టిన రోజు నాడు దీక్షకు కూర్చుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునా యుడిని ఇతర పార్టీల నేతలు, సంఘాల నాయకులు , ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలి.

cbn deeksha 18042018

విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో ముఖ్యమంత్రి దీక్ష చేస్తారు. దీని ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షిస్తారు. పలు పార్టీల నేతలు, అఖిలపక్ష నేతలు ఇందులో పాల్గొంటారు. మైదానంలో రెండు వేదికలు ఏర్పాటు చేస్తారు. ప్రధాన వేదికపై చంద్రబాబుతోపాటు 150 మంది కూర్చుంటారు. మరో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలులో ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే ధర్మ పోరాట దీక్ష లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

అన్ని పార్టీలు, పక్షాలకు ఆహ్వానం.. ధర్మ పోరాట దీక్షకు అన్ని పార్టీల నేతలను, అఖిలపక్ష నేతలను ఆహ్వానిస్తున్నామని నారా లోకేశ్‌ తెలిపారు. వారితో పాటు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా, వాణిజ్య, ఉపాధ్యాయ సంఘాలు, బార్‌ అసోసియేషన్‌, ట్రేడ్‌ యూనియన్లు, రిక్షా, ఆటో యూనియన్లు, విద్యార్థి సంఘాలతో పాటు వైద్యులు, ఇతర వృత్తుల వారంతా దీక్షలో పాల్గొనాలని కోరారు. ‘‘ఏపీకి జరుగుతున్న అన్యాయంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఢిల్లీలో కదలిక రావాలని ఈ పవిత్ర దీక్షకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి తెలిపేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి’’ అని తెలిపారు. విభజన కష్టాలున్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందని... సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని చెప్పారు.

cbn deeksha 18042018

ఆంధ్రుల్లో ఐక్యతను పాదుకొలపనున్న సీఎం దీక్ష ... ‘రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయానికి, మోసానికి నిరసనగా ఐదు కోట్ల ఆంధ్రుల పక్షాన ముఖ్యమంత్రి తన పుట్టిన రోజునాడు ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ దీక్షకు మద్దతు ఇచ్చి ఆంధ్రుల ఐక్యతను చాటనున్నారు... రాష్ట్ర విభజన సమయంలో సమన్యాయం కోసం 2013 అక్టోబరులో ఢిల్లీలో వారం రోజులపాటు చంద్రబాబు దీక్ష చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు ఒకే మాట ఒకే బాటగా ముందుకు సాగుతున్నారు.. 2014 ఎన్నికల ముందు కనీస ధర్మం పాటించకుండా రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. ఆదాయం వచ్చే హైదరాబాద్‌ను తెలంగాణాకు ఇచ్చి, పెద్దగా ఆదాయం లేని 13 జిల్లాలను ఆంధ్రాకు ఇవ్వడం 5 కోట్ల ప్రజలను ఆవేదనకు లోనుచేస్తోంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి బహిరంగ సభలో ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని, రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని మోదీ హామీ ఇచ్చి మాట తప్పారు. బీజేపీ నేతలు ఆ హామీని ఒకసారి గుర్తుకు తెచ్చుకోకుండా తిరిగి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గుదిబండగా మారుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనుల హామీలను అమలు చేయాల్సిన మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపుతోంది. ఎన్నికల ముందు ఏపీకి వారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని యావత్ ఆంధ్రుల కోరిక ఆకాంక్ష. తెలుగు ప్రజలు చాలా తెలివైనవారు, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఏపీలో కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి కూడా పడుతుందన్న వాదన ప్రజల్లో నెలకొంది. రాష్ట్ర ప్రయోజనాలకోసం అన్ని పార్టీలు జెండాలు, అజెండాలు పక్కన పెట్టి పోరాటానికి సిద్ధపడాల్సిన సమయం ఆసన్నమైంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read