Sidebar

02
Sun, Mar

విశాఖపట్టణం ఎంపీ సీటు పై కన్నేసిన, A2 విజయసాయి రెడ్డి, వైజాగ్ ఫై పూర్తి ఫోకస్ పెట్టాడు.. అక్కడే ఒక ఇల్లు, ఆఫీస్ తీసుకుని, వైజాగ్ పై దండయాత్రకు రెడీ అవుతున్నాడు.. దీని కోసం, గత వారం రోజులుగా వైజాగ్ లో పాదయాత్ర చేస్తున్నాడు విజయసాయి రెడ్డి... జగన్ మోహన్ రెడ్డి పాదయత్రకు మద్దతుగా పాదయత్ర చేస్తున్నా, మీ కష్టాలు నాకు చెప్తే, నేను తీరుస్తా అంటూ వైజాగ్ వీధుల పై తిరుగుతున్నాడు... చంద్రబాబుని జైలుకు పంపుతా, కేంద్ర మంత్రిని అవుతా, రాబోయేది మా ప్రభుత్వమే అంటూ, ఏవేవో మాట్లాడుతూ ప్రజలకు చెప్తున్నాడు... అంతే కాదు, ఐఏఎస్ లు ఐపీఎస్ లను కూడా లోపల వేస్తా అంటూ, పాదయాత్రలో హల్ చెల్ చేస్తున్నాడు విజయసాయి రెడ్డి... అసలు తాను ఎందుకు పాదయత్ర చేస్తున్నాడు, రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే ఏమి చేస్తాడో చెప్పకుండా, కేవలం చంద్రబాబు నామస్మరణ చేస్తూ సాగుతున్న విజయసాయి పాదయాత్రకు నిన్న అనుకోని జర్క్ ఎదురైంది...

vijayasayi 09052018 2

నిన్న ఒక చిన్న పాటి మీటింగ్ పెట్టి, ప్రత్యేక హోదా పై జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో, వైసిపీ పార్టీ, మోడీ పై యుద్ధం చేస్తుంది అని ప్రసంగం మొదలు పెట్టటంతో, అందరూ అవాక్కయ్యారు... అసలు మోడీ పై ఒత్తిడి తెస్తుంది మేమే, ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు అందరూ రాజీనామా చేసారు, తొందర్లోనే మా ఎమ్మల్యేలు కూడా రాజీనామా చేస్తారు అంటూ, విజయసాయి ప్రసంగం విని, ఒక యువకుడుకి చిర్రేత్తుకు వచ్చింది.. దీంతో, ఆ యువకుడు, విజయసాయి ప్రసంగానికి అడ్డు తగిలి, వాళ్ళ సంగతి తరువాత, ముందు మీరు ఎందుకు రాజీనామా చెయ్యలేదు అని విజయసాయిని ఎదురు ప్రశ్న వేసాడు... మీరు రాజ్యసభలో ఎంపీ కదా, అందరూ రాజీనామా చేస్తే, మీరు ఎందుకు చెయ్యలేదు అని ప్రశ్నించాడు...

vijayasayi 09052018 3

అంతే కాదు, మీరు రాజీనామా చెయ్యకుండా, మోడీ ఆఫీస్ లో ఎందుకు ఉంటున్నారు ? అవిశ్వాస తీర్మానం అని మోడీ మీద పెట్టి, ఆ అవిశ్వాస తీర్మాన కాపీని తీసుకుని, మోడీ ఆఫీస్ కు ఎందుకు వెళ్లారు అంటూ, ఆ యువకుడు వైజాగ్ దమ్ముతో ప్రశ్నలు సందించాడు... అంతే, ఆ యువకుడుకి ఏమి సమాధానం చెప్పాలో, తెలియక, విజయసాయి అక్కడ నుంచి నెమ్మదిగా జారుకున్నాడు.. ఇలాంటి వారిని ఎందుకు మాట్లాడనిచ్చారు ? మన వాళ్ళు ఉన్నారు కదా ? జగన్ పాదయత్రలో, ఇలాంటి ప్రశ్నలు వెయ్యటానికి కొంత మందిని పెట్టుకున్నాం కదా, వారిని తీసుకురమ్మంటే, తీసుకు రాకుండా, ఇలాంటి వారితో నా పరువు తీస్తారా అంటూ, అక్కడ స్థానిక నాయకుల పై, విజయసాయి ఆగ్రహం వ్యక్తం చేసారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read