15వ ఆర్థిక సంఘం విధివిధానాల పై అమరావతిలో జరిగిన మీటింగ్ తో, దెబ్బకు కేంద్రం దిగి వచ్చింది. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు మార్చాలంటూ దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు రెండుసార్లు సమావేశమయ్యాయి. ఒకటి కేరళలో, రెండోది ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జనాభా, భర్త్ రేట్ ప్రాతిపదికన నిధుల పంపకం జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ నష్టం జరుగుతుందని పేర్కొన్నాయి. అలాగే సంక్షేమ పథకాలను కూడా సమీక్ష చేయాలని దక్షిణాది రాష్ట్రాలు సూచించాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆర్థిక సంఘం బుధవారం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ వేసింది. సభ్యులుగా అరవింద్‌ విర్మాని, సుర్జిత్‌ ఎస్‌ భల్లా, సంజీవ్‌ గుప్తా, పినాకి చక్రవర్తి, సాజిద్‌, నీలకంఠ మిశ్రా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నదాంట్లో ఏ మేరకు నిజం ఉందన్నదానిపై ఈ కమిటీ అధ్యాయనం చేసి నివేదిక తయారు చేసి కేంద్ర ఆర్థిక సంఘానికి అందజేయనుంది.

amaravati meeting 09052018 2

ప్రగతిశీల రాష్ట్రాలు నీరుగారిపోయేలా కేంద్ర ప్రభుత్వ తీరు వుందని, సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా నడుచుకుంటోందని వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్ధిక మంత్రుల సదస్సు అభిప్రాయపడింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న వివక్షకు 15వ ఆర్ధిక సంఘం విధివిధానాలు అద్దంపడుతున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 15వ ఆర్థిక సంఘం రూపొందించిన టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్ (టీవోఆర్)ను వ్యతిరేకించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సోమవారం వివిధ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు సచివాలయంలో సమావేశం నిర్వహించారు.

amaravati meeting 09052018 3

గత నెల 10న కేరళలోని తిరువనంతపురంలో మొదటిసారి ఈ సమావేశం జరగ్గా, రెండో సమావేశానికి అమరావతి ఆతిధ్యం ఇచ్చింది.
2011 జనాభా లెక్కల ప్రకారం నిధుల కేటాయింపు చేస్తామంటే జనాభా నియంత్రణ పాటిస్తూ, ఆర్ధికంగా పురోగతిలో వున్న రాష్ట్రాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం తీరు ప్రగతిశీల రాష్ట్రాలకు శిక్ష విధించేట్టుగా వుందన్నారు. అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలు ఎట్టిపరిస్థితుల్లో నష్టపోవడానికి వీల్లేదని చెప్పారు. ఈ అన్యాయాన్ని సహించేది లేదన్నారు. న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలను మార్చాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతిని కలుద్దామని ముఖ్యమంత్రి సూచించారు. అయితే, ఈ లోపే కేంద్ర ప్రభుత్వం దెబ్బకు లైన్ లో పడింది... కేంద్ర ఆర్థిక సంఘం బుధవారం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ వేసింది... ఈ అభ్యంతరాలు అన్నీ ఆ కమిటీ సమీక్షించి, కేంద్రానికి నివేదిక ఇస్తుంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read