ఏమైనా చేసుకోండి.... కర్ణాటకలో సియం ఎవరైతే మాకేంటి...? బీజేపీ ఎక్కడ ఆగాలో అక్కడాగింది... ట్రెండ్స్ వస్తున్నంత సేపు ఎగెరెగిరి పడిన వారు.... వారి కంటకాగిన వారి ఆనందానికి అంతులేదు.. .ప్రజలకి ఇంకొక సారి స్పష్టత వచ్చింది... సీట్లు... ఓట్లు లెక్క మాకొద్దు... మాసాటి తెలుగోడు, మాగోడు విన్నాడా లేదా.... అదే మాక్కావాలి... తెలుగు వారు బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్నారని అర్దమవుతుంది... గాలి బ్యాచ్ ఆరుగురుని ఓడించారు... ఆంధ్రా బోర్డర్ లో ఉన్న భాగేపల్లి ...పాపం సాయికుమార్ డిపాజిట్ కోల్పోయారు...

karnataka 15052018 2

తెలుగువారు అధికంగా ఉన్న చోట కాంగ్రెస్, జేడియస్ అధిక స్దానాలు గెలుచుకున్నాయి... అధిక స్దానాలు సాధించిన బీజేపీ కంటే కాంగ్రెస్ కి ఎక్కువ శాతం ఓట్లు లభించాయి.... తెలుగు వారి ప్రభావం లేకపోతే బీజేపీ ఏకపక్షంగా గెలిచే అవకాశం ఉండేది... కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా ... దేశాన్ని పాలిస్తున్న ... డబ్బులు విరజిమ్మే గాలి బ్యాచ్ తోడుగా... బూత్ మేనేజ్ మెంట్ చేసే సంఘపరివార్.. వేలాది మంది దేశవ్యాప్త బీజేపీ శ్రేణులు.. మోదీ అప్రతిహత ప్రచారం...ఇవేవి పూర్తి స్దాయి విజయాన్ని అందించలేకపోయాయి... ఇక్కడే తెలుగోడి పవర్ తెలుస్తుంది...

karnataka 150520183

తెలుగు ప్రజలు కీలకం అయిన దాదాపు 46 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 32 చోట్ల గెలుపొందగా, జెడిఎస్ 9 చోట్ల మరియు బిజెపి కేవలం 5 స్థానాల్లో గెలుపొందింది. దీనితో బిజెపి రాష్ట్రంలో 104 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. హైద‌రాబాద్-క‌ర్ణాట‌క రీజియ‌న్ లో చూసుకుంటే… భాజ‌పాకి 15 సీట్లొచ్చాయి. కాంగ్రెస్ కి 21, జేడీఎస్ కి 4 ద‌క్కాయి. తెలుగువారు అత్యధికంగా బెంగ‌ళూరు సిటీ, రూర‌ల్ ప్రాంతాల్లో కూడా భాజ‌పాకి గ‌ట్టి ఎదురుదెబ్బే త‌గిలింది. ఈ ప్రాంతంలో మొత్తం 34 స్థానాల‌కిగాను, 11 మాత్ర‌మే ద‌క్కించుకోగ‌లిగింది.. రాయ్ చూర్ జిల్లాలోని 7 సీట్లలో, బీజేపీ విజయం సాధించింది కేవలం రెండు స్థానాల్లోనే.. కొప్పాల్ లోని 5 సీట్లలో బీజేపీ దక్కించుకుంది, 3 స్థానాలే.. అదేవిధంగా, బళ్లారిలో 9 స్థానాల్లో మూడు మాత్రమేబీజేపీ ఖాతాలో చేరాయి. చిక్ బళ్లాపూర్ లోని ఐదు స్థానాల్లో, కోలార్ లో 6 స్థానాల్లో పోటీ చేసిన, బీజేపీకి ఒక్క స్థానమూ దక్కకకపోవడం గమనార్హం... గవర్నర్ ని అడ్డం పెట్టుకుని ఏం చేసుకున్నా మాకు అనవసరం... ఆంధ్రోడి దెబ్బ ఏంటో తెలుసుకుని, ఇప్పటికైనా మాకు చెయ్యల్సింది చెయ్యండి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read