దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అయితే ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. వందకుపైగా సీట్లతో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీకి దగ్గరలో నిలిచిపోయింది. ఇక అధికార కాంగ్రెస్‌ 70కిపైగా సీట్లతో రెండోస్థానంలో ఉంది. హంగ్‌ దిశగా సాగుతున్న కన్నడ రాజకీయాల్లో 35కుపైగా సీట్లతో జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో జేడీఎస్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారిన పరిస్థితుల్లో ఆ రాష్ట్ర గవర్నర్‌పైనే అందరి దృష్టి ఉంది. గవర్నర్‌ వాజుభాయి వాలా నిర్ణయం కీలకం కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీని ఆహ్వానిస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

amitshah 1502018 2

గుజరాత్‌ మాజీ భాజపా నేత అయిన వాజుభాయి వాలా ‌ 2002లో నరేంద్ర మోదీ కోసం తన నియోజకవర్గాన్ని వదులుకున్నారు. అనంతరం గుజరాత్‌లో మోదీ ప్రభుత్వంలో వాజుభాయి ఆర్థిక శాఖమంత్రిగా బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఈ నేపధ్యంలో అమిత్ షా తన యాక్షన్ ప్లాన్‌ను మొదలుపెట్టారు. ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక బీజేపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన కేంద్ర మంత్రి ప్రకాష్‌జవదేకర్‌తో అమిత్ షా సమావేశమయ్యారు. అంతేకాదు, జేడీ(ఎస్) తరపున గెలిచిన 10మంది ఎమ్మెల్యేలతో అమిత్ షా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాదు, ప్రకాష్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డాలను బెంగళూరుకు పంపించి.. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాలపై ఎప్పటికప్పుడు సంప్రదించాల్సిందిగా అమిత్ షా ఆదేశించారు.

amitshah 1502018 3

అయితే కాంగ్రెస్, జేడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇరు పార్టీల నేతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే గవర్నర్ అపాయింట్‌మెంట్ దొరక్క పోవడంతో దీనిపై క్లారిటీ రాలేదు. కాగా ప్రభుత్వ ఏర్పాటు గురించి రాష్ట్ర గవర్నర్‌ను కాంగ్రెస్ పార్టీ అపాయింట్‌మెంట్ కోరగా చుక్కెదురైంది. ఆ వెంటనే బీజేపీ నేతలు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరడంతో రాజకీయ సమీకరనలు మారనున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని గత ఎన్నికల పరిణామాలే చెబుతున్నాయి. అయితే సీఎం పదవి జేడీఎస్‌కేనని ప్రకటించిన కాంగ్రెస్‌కు కలిసి వస్తుందా లేదా చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read