ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. సావరకోట మండలంలో బొంతు ఎత్తిపోతల పథకానికి ఆయన ఇవాళ శంకుస్థాపన చేసారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో రూ.180 కోట్లతో తలపెట్టిన బొంతు ఎత్తిపోతల పథకానికి నేడు శంకుస్థాపన చేసారు. వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేసేలా, 67 గ్రామాల దాహార్తి తీర్చేందుకు ఈ ప్రాజెక్టును ఉపయోగపడనుంది. నిర్థిష్ట సమయానికి పూర్తి చేసి సారవకోట రూపురేఖలు మారుస్తామని చెప్పారు. సారవకోట మండలం రంగసాగరంలో నీరు చెట్టు పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పితాని, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
అనంతరం రంగసాగారం వద్ద ఏర్పాటు చేసిన మీటింగ్ లో చంద్రబాబు పాల్గున్నారు. బీజేపీకి కొత్త పూజారి వచ్చాడని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాడని కన్నా సర్టిఫికెట్ ఇచ్చారని, వైసీపీకి వెళ్ళటానికి సిద్ధమైన నేతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని చేసిందని విమర్శించారు. శుక్రవారం కోర్టుకు వెళ్లే వారు తనపై విమర్శలు చేయడం బాధాకరమని సీఎం అన్నారు. ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, ఐదు బడ్జెట్లలో తెలుగు ప్రజలకు కేంద్రం అన్యాయం చేసిందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి, సంక్షేమంపై తన కంటే బాగా చేస్తే చర్చకు రావాలని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు.
కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడంతో, ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ముసలం వచ్చిన సంగతి తెలిసిందే.. సోము వీర్రాజు వర్గం, సోము వీర్రాజుకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనందుకు నిరసనగానే రాజీనామాలు చేసి వాటిని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు, ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌కు పంపారు. అయితే, రాత్రికి, వీరు మెత్త బడ్డారు. రాజీనామా చేసి, జగన్ పార్టీలోకి మరో గంటలో చేరాల్సి ఉండగా, హాస్పిటల్ లో చేరిన, కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ రాష్ట్ర అధ్యకుడుగా ప్రకటించారంటేనే, వారి పార్టీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చి, ఒక సంవత్సరం బీజేపీలో ఉండి, రాజీనామా చేసిన వ్యక్తి, బీజేపీ అధ్యక్ష పదవికి దిక్కు అయ్యాడు.. ఇలాంటి స్థితిలో ఉన్న బీజేపీ, చంద్రబాబుకి చుక్కలు చూపిస్తుంది అంట... ఇదే విషయం పై, ఈ రోజు చంద్రబాబు పంచ్ వేసారు.