12 ఓట్లతో గెలిచాను, ఇక నియోజకవర్గ సమస్యలు ఎందుకు అనుకున్నాడో ఏమో, పనీ పాట ఏమి లేనట్టు, ఎక్కడ లిటిగేషన్ ఉంటే, అది పట్టుకుని కేసులు వేసి, ఎప్పుడూ కోర్ట్ ల చేత మొట్టికాయలు తింటా ఉంటాడు, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మల్యే, జగన్ కు అత్యంత సన్నిహితుడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి... అమరావతి మీద ఎన్ని కేసులు వేసాడో చూసాం, పేదలకు ఇచ్చే ఫైబర్ నెట్ మీద కేసులు, సాధావర్తి భూముల పై కేసులు వేసి, ప్రభుత్వానికి రూపాయ్ ఆదాయం రాకుండా చేసాడు... అయితే, ఇప్పుడు రివర్స్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పైనే కేసు వేసే పరిస్థితి వచ్చింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి భాగోతాలు బయటకు లాగటానికి ఏసీబీ రంగంలోకి దిగింది.

alla 16052018 2

ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. బినామీ ఆస్తుల కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది. గతంలో ఏసీబీకి పట్టుబడిన డీఎస్పీ దుర్గాప్రసాద్‌కు ఆళ్ల రామకృష్ణారెడ్డి బినామీగా ఉన్నారని ఏసీబీకి సమాచారం ఉంది. ఈ క్రమంలో విచారణకు హాజరుకావాలని ఐపీసీ సెక్షన్ 160 కింద ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గత సంవత్సరం, అంటే జనవరి 18, 2017లో ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారన్న ఆరోపణలు ఒకవైపు, ఏ కేసు నిమిత్తం వెళ్లినా లంచాలు తెమ్మని పీడిస్తారన్న ఫిర్యాదులు మరోవైపు వెల్లువెత్తడంతో, ఒంగోలు పీటీసీ డీఎస్పీ దుర్గా ప్రసాద్ ఇళ్లపై నేడు ఏసీబీ దాడులు చేసింది.

alla 16052018 3

గుంటూరు, ఒంగోలు, చీరాల, హైదరాబాద్ ప్రాంతాల్లోని ఆయన, ఆయన బంధువుల ఇళ్ల పై ఏకకాలంలో దాడులు చేసారు. ఒక్క గుంటూరులోనే 11 చోట్ల 11 బృందాలు దాడులు చేయగా, భారీ ఎత్తున అక్రమాస్తులు, నగదు బయటపడ్డట్టు తెలుస్తోంది. అయితే , విషయం తెలుసుకున్న దుర్గా ప్రసాద్ బాధితులు గుంటూరులో సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈయన వల్ల గతంలో ఇబ్బందులు పడినవారు, ఈ విధంగా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి ఘరానా మోసాగాడిగా పేరు ఉన్న అధికారికి, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బినామీ ఆస్తుల కేసులో దొరికాడని, ఏసిబి విచారణకు రమ్మంది. ఇలా అధికారులు, జగన్ పార్టీ ఎమ్మల్యేలు కలిసి, ఇంకా ఎన్ని బినామీ ఆస్థులు సంపాదించారో, ప్రభుత్వమే విచారణ చేసి బయట పెట్టాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read