మొన్న అమిత్ షా పై నిరసన తెలిపితే, చించుకున్న బీజేపీ నేతలు, ఈ రోజు మన హక్కులు అడుగుతున్నందుకు, హీరో శివాజీ పై దాడి చేసారు బీజేపీ కార్యకర్తలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్టీకి రాజీనామా చేసి, వైసిపీలో చేరిన, కన్నా లక్ష్మీనారాయణ విజయవాడకు చేరుకోనున్న నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు విమానాశ్రయం వద్దకు బీజేపీ శ్రేణులు వచ్చాయి. ఇదే టైంలో హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం వద్దకు వచ్చిన శివాజీని చూసి ఆయనకు వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. శివాజీ గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మోదీపై విమర్శలు చేస్తావా? అమిత్ షా ను విమర్శలు చేస్తావా ? మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటూ కొందరు భాజపా కార్యకర్తలు ఆయనపై దుర్భాషలాడుతూ అడ్డుకున్నారు. ఆయన కారును అడ్డుకొనే ప్రయత్నం చేశారు. శివాజీ కూడా కార్ కిందకు దిగి, అదే స్థాయిలో వారి పై తిరగబడ్డారు... నేను రాష్ట్రం ప్రయోజనాల కోసం అడుగుతున్నాని, అడుగుతూనే ఉంటానని, మీలాంటి ఉడత ఊపులకు భయపడను అంటూ శివాజీ కూడా వారికి సమాధానం చెప్పారు..
నిన్ను చంపుతాం, ఇక్కడే పాతేస్తాం అంటూ, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళలేవు అంటూ, కొంత మంది కార్యకర్తలు శివాజీ పై దాడి చేసారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నటుడు శివాజీకి రక్షక కవచంగా నిలిచారు. అనంతరం ఆయనను కారులో పంపించేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే మొన్న అమిత్ షా పై కొంత మంది నిరసన తెలిపితే, మెము ఎంతో శాంత మూర్తులం అని బిల్డ్ అప్ ఇచ్చిన బీజేపీ నేతలు, ఇప్పుడు ఏమి చెప్తారో మరి... అయినా, శివాజీ ఒక్కడే కాదు, 5 కోట్ల మంది ఆంధ్రులు అడుగుతున్నారు... మోడీని నిలదీస్తున్నారు.. అందరినీ కొడతారా ?