గత పార్లమెంట్ సమావేశాల్లో, జగన్ ఎంపీలు ఆడిన డ్రామాలు అన్నీ ఇన్నీ కాదు. అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం అంటూ హంగామా చేసి, అదే అవిశ్వాస తీర్మానం పట్టుకుని, ప్రధాని ఆఫీస్ లో దొరికిపోయాడు విజయసాయి రెడ్డి. దీంతో తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగి, మోడీ పై అవిశ్వాస తీర్మానం పెట్టి, అన్ని పార్టీల మద్దతుతో పోరాడారు.. మోడీ కనిపిస్తే, పార్లమెంట్ లో ఆందోళన చెయ్యకుండా, వైసీపీ ఎంపీలు పారిపోయే వారు. విపక్షాలు అన్నీ కలిసి మోడీకి వ్యతిరేకంగా, మానవహారం పెడితే, ఎక్కడ అమిత్ షా చూస్తారో అని, దానికి డుమ్మా కొట్టారు వైసీపీ ఎంపీలు. ఇలా డ్రామాలు ఆడుతూ ఆడుతూ, మోడీ మీద విశ్వాసం ఉంది అని చెప్తూ, అవిశ్వాస తీర్మానం పెట్టి, రక రకాలుగా ప్రజలను మభ్య పెట్టి, చివరి రోజు మేము రాష్ట్రం కోసం రాజీనామాలు చేస్తున్నాం అంటూ, కధ ముగించారు వైసీపీ ఎంపీలు..
అయితే, ఈ రాజీనామా డ్రామాలు అందరూ మర్చిపోయారు అనుకుంటున్న టైంలో, కర్ణాటక ఎన్నికల్లో శ్రీరాములు, యెడ్యూరప్ప తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన, గంట లోపే, స్పీకర్ రాజీనామాలు ఆమోదించారు. దీంతో మళ్ళీ అందరి చూపు వైసీపీ ఎంపీల రాజీనామా డ్రామాల పై పడింది. మూడు నెలలు అయినా, వీరి రాజీనామాలు ఎందుకు ఆమోదించలేదు అంటూ చర్చ మొదలైంది. ఇవన్నీ డ్రామాలు అంటూ మరో సారి విమర్శలు వచ్చయి. దీంతో ఇప్పుడు ఈ రాజీనామా డ్రామాలో తరువాత ఎపిసోడ్ వచ్చింది. స్పీకర్ కార్యాలయం, ఈ రోజు వైసిపీ ఎంపీలను వచ్చి కలవమని కబురు పంపింది. ఎంపీలు తమ రాజీనామాలను భావోద్వేగంతో చేశారా? లేక, నిజంగానే సీరియస్ గా ఉన్నారా...? అన్న విషయాన్ని పరిశీలించి, ఆపై స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది
అయితే ఈ విషయం పై, విజయసాయి రెడ్డి సన్నిహితుల వద్ద చెప్పిన మాటలు విస్మయానికి గురి చేసాయి. మనోళ్ళు రాజీనామా ఎలాంటిదో తెలిసిందేగా, ఎందుకు ఆందోళన చెందుతున్నారు అంటూ, రెండు విషయాలు చెప్పారు విజయసాయి.. ఒకటి స్పీకర్ ఇవి భావోద్వేగంతో చేసినవి అని, రాజీనామాలు ఆమోదించారు... రెండోది ఆమోదించినా, సార్వత్రిక ఎన్నికలు ఏడాది లోపు ఉంటే, ఇప్పుడు ఎన్నికలు రావు. ఎలా చూసుకున్నా మనం సేఫ్ కదా. రాజీనామా చేసేము, పోరాడుతున్నాము అనే పేరు వచ్చింది కదా... ఏ నిర్ణయం తీసుకోవాలో ఢిల్లీ వాళ్ళు చూసుకుంటారు. మనం దానికి తగ్గట్టు, ట్యూన్ అవ్వటమే అంటూ, చెప్పారు. మరో పక్క ఎంపీలు అందరూ రాజీనామా చేసినా, తాను కూడా ఎంపీ అయినా విజయసాయి రెడ్డి మాత్రం, రాజీనామా చెయ్యని విషయం తెలిసింది. మొత్తానికి ఇది ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి..