వైసీపీ ఎంపీల రాజీనామాలు భావోద్వేగపూరితంగా ఉన్నాయని, ఏపీలో ఉన్న ఉద్వేగ పూరిత పరిస్థితుల వల్ల వారు రాజీనామాలు చేసినట్లు తనకు అనిపిస్తోందని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఇవన్నీ అమిత్ షా డైరెక్షన్ లో జరుగుతున్నాయి అనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో నిన్న వారు లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో భేటీ అయ్యారు. అనంతరం సుమిత్రా మహాజన్‌ మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తన పై ఉందని సుమిత్రా మహాజన్‌ పేర్కొన్నారు. భావోద్వేగపూరితంగా ఉన్నాయి కాబట్టి, మరో వారం రోజుల తరువాత రావాలని స్పీకర్ వారితో చెప్పారు.

ycp mp 30052018 2

అయితే, తమ పదవులకు రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపీల భవిష్యత్తు పై జూన్ 5 నుంచి 7వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించిన నేపథ్యంలో, వీరి రాజీనామాలు ఆమోదించినా, ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితులు ఎంతమాత్రమూ కనిపించడం లేదు. 2014 పార్లమెంట్ ఎన్నికల తరువాత జూన్ 4వ తేదీన లోక్ సభ సమావేశం జరుగగా, వచ్చే సంవత్సరం జూన్ 3తో మోదీ సర్కారుకు ఐదేళ్ల పదవీ కాలం పూర్తవుతుంది.

ycp mp 30052018 3

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం, ఓ ఉప ఎన్నిక జరిగితే, అందులో గెలిచే సభ్యుడి పదవీకాలం కనీసం ఏడాది పాటు ఉండాలి. జూన్ 5నే ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నా, ఎన్నికలు జరగాలంటే ఆపై మరో నెల రోజుల సమయమైనా పడుతుంది. అప్పుడు గెలిచే సభ్యుడి పదవీకాలం ఏడాది ఉండదు. ఇక నెలన్నర క్రితమే వీరి రాజీనామాలు ఆమోదం పొందినా, ఉప ఎన్నికలు వచ్చేవి కావని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రత్యేక కారణాలవల్ల ఖాళీ అయ్యే చోట్ల ఎన్నికలు జరిపించేందుకు ఈసీ 90 రోజుల వరకూ సమయం తీసుకుంటుంది కాబట్టి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read