పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏమి చేస్తాడో, ఎందుకు చేస్తాడో అర్ధం కాదు.. ఈ రోజు ఒక మాట మాట్లాడుతాడు, రేపు ఒకటి అంటాడు... పూర్తి భిన్నంగా ఆయన ప్రకటనలు ఉంటాయి... దేని మీద నిలకడ ఉండదు... ఇవన్నీ అందరికీ తెలిసినవే... అయితే సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చాను, ఇంకా ప్రజల మధ్యే నా జీవితం అంటూ, శ్రీకాకుళం టూర్ మొదలు పెట్టాడు పవన్... ఇప్పటి వరకు పవన్ కే కన్ఫ్యూజన్ అనుకున్నారు అందరూ, కాని ఆ పార్టీ వాళ్లకి కూడా ఈ కన్ఫ్యూజన్ ఉందని, రెండు రోజుల నుంచి వస్తున్న ప్రెస్ నోట్లు చూస్తుంటే అర్ధమవుతుంది.. లేకపోతే కావాలనే ఇలా చేస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది... ఇవన్నీ ఎలా ఉన్నా, మీడియా ప్రతినిధులు మాత్రం, ఈ ప్రెస్ నోట్లు చూసి తల బాదుకుంటున్నారు..
విషయం ఏంటి అంటే, నిన్న ఒక ప్రెస్ నోట్ వదిలారు... గురువారం పోరాట యాత్రకు విరామం అని చెప్పారు. దానికి కారణం, పవన్ కు సెక్యూరిటీగా ఉన్న బౌన్సర్లకు గాయాలు అయ్యాయి అంట.. 11 మంది బౌన్సర్లకి గాయాలు అయ్యాయి అని, వారు తీవ్రంగా గాయపడ్డారు అని, వారు కోలుకోవటం కోసం, వారిని సొంత ఊరు పంపించామని, వారిస్ స్థానంలో కొత్త వారు రావాల్సి ఉంది కాబట్టి, గురువారం పోరాట యాత్రకు సెలవు అని చెప్పారు.. అంతే కాదు, పోలీసులు సెక్యూరిటీ ఇవ్వలేకపోవటం వల్లే వీరికి గాయాలు అయ్యాయని ఆ ప్రెస్ నోట్ లో చెప్పారు... ఈ విషయం పై శ్రీకాకులం ఎస్పీ స్పందిస్తూ, ఇవన్నీ అవాస్తవాలు అని, ఎంత మందితో సెక్యూరిటీ ఇచ్చింది, పూర్తి వివరాలు చెప్పారు..
సరే కుర్రాడు ఎదో రాజకీయం చేస్తున్నాడేలే అని అందరూ అనుకుంటూ ఉన్న టైంలో, ఈ రోజు మరో ప్రెస్ నోట్ వచ్చింది... రేపు (శుక్రవారం) కూడా, పవన్ పోరాట యాత్రకు సెలవు అని చెప్పారు.. దానికి కారణం, పవన్ వ్యక్తిగత సిబ్బంది, ఇంకా కోలుకోలేదు అని చెప్పారు.. ఈ దెబ్బతో, మీడియా ప్రతినిధుల ఫ్యుజ్ లు ఎగిరిపోయాయి... నిన్న ఆ దెబ్బలు తగిలన వారికి ఊరికి పంపించాము, కొత్త వారు వస్తున్నారు అని చెప్పారు, ఈ రోజు ఏమో, వారికి దెబ్బులు తగ్గలేదు కాబట్టి, రేపు కూడా సెలవు అంటున్నారు, అసలు ఏంటి ఇది, మేము ఎలా న్యూస్ వెయ్యాలి ? మీరు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు, ఆ వార్తా మేము వేస్తే, మేము తప్పు దోవ పట్టిస్తున్నామని ప్రజలు అనుకుంటారు అని, మీడియా వాళ్ళు లబోదిబో అంటున్నారు... అసలు బౌన్సర్లకు గాయాలు అయ్యాయని, యాత్ర వాయిదా వెయ్యటంతో ఏంటో, కొత్త తరహా రాజకీయం అంటే ఇదేనేమో అంటూ, రేపు ఇంకా ఏమి ప్రెస్ నోట్ వస్తుందో అంటూ, జుట్టు పీక్కుంటున్నారు..