గత వారం రోజులుగా, వీళ్ళ రాజకీయాలకు, దేవుడుని కూడా వాడుకుని, తిరుమల ప్రతిష్టతను ఎలా మంటగలుపుతున్నారో చూస్తున్నాం.. పోనీ వాటిలో ఏమన్నా నిజం ఉందా అంటే, అన్నీ అవాస్తవాలే అని అందరూ చెప్తున్నారు. రమణదీక్షితులు, ఐవైఆర్‌, బీజేపీ, వైసీపీ తప్ప, ఎవరూ తిరుమల పై విషం చిమ్మటం లేదు. పింక్ డైమెండ్ అని, నేలమాళిగలు అని, అసలు అక్కడ లేనివి ఉన్నట్టు చెప్తూ, ప్రజల్లో ఎదో జరిగిపోతుంది అనే భ్రమలు కలిగిస్తున్నారు. ఈ విషయం పై సుప్రీం న్యాయవాది డీవీ రావు తన అభిప్రాయాన్ని చెప్పారు. జెనీవాలో వేలం వేశారంటున్న వజ్రం తిరుమల శ్రీవేంకటేశ్వరుడిదే అయితే.. నాటి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుతో పాటు టీటీడీ మాజీ ఈవో ఐవైఆర్‌ కృష్ణారావులను అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్‌ డీవీ రావు అన్నారు. కస్టమ్స్‌ అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు.

tirumala 24052018 2

తిరుమల శ్రీవారిని దర్శించుకుని, బుధవారం కనకదుర్గమ్మ దర్శనానికి విజయవాడ వచ్చిన ఆయన తాజా వివాదంపై విలేకరులతో మాట్లాడారు. ‘అర్చకులు కారుణ్య నియామకాలను కోరవచ్చు. కానీ రిటైర్మెంట్‌ తర్వాత వంశపారంపర్యంగా కోరడం సరికాదు. టీటీడీలో పదవీవిరమణ వయసు నిబంధన పాలసీ విషయమని హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. 1987, 2012ల్లో జారీఅయిన జీవోలను 2018లో సవాల్‌ చేసే అవకాశం లేదు. ఆ జీవోల ప్రకారం 2013లో చాలా మంది రిటైరయ్యారు’ అని గుర్తుచేశారు.

tirumala 24052018 3

‘2001లో తన సమక్షంలో గరుడ సేవలో పింక్‌ వజ్రం పగిలిందని రమణ దీక్షితులు చెబుతున్నారు. పగిలింది రూబీ అని, వజ్రం కాదని 2010లో అప్పటి ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు నివేదిక ఇచ్చారు. జస్టిస్‌ జగన్నాథరావు కమిటీ కూడా దానిని సమర్థించింది. ఈ నేపథ్యంలో జెనీవాలో వేలం వేసిన గులాబీ వజ్రం శ్రీవారిదై ఉండవచ్చని రమణ దీక్షితులు పేర్కొనడంపై భక్తులు ఎవరైనా తమ సమీపంలోని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే.. రమణ దీక్షితులుతో పాటు కృష్ణారావును కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read