గత వారం రోజులుగా, వీళ్ళ రాజకీయాలకు, దేవుడుని కూడా వాడుకుని, తిరుమల ప్రతిష్టతను ఎలా మంటగలుపుతున్నారో చూస్తున్నాం.. పోనీ వాటిలో ఏమన్నా నిజం ఉందా అంటే, అన్నీ అవాస్తవాలే అని అందరూ చెప్తున్నారు. రమణదీక్షితులు, ఐవైఆర్‌, బీజేపీ, వైసీపీ తప్ప, ఎవరూ తిరుమల పై విషం చిమ్మటం లేదు. ఆలయ ప్రధాన అర్చుకుడిగా పని చేసిన రమణ దీక్షితులు గారు, బీజేపీ నాయకులని కలుస్తూ, తిరుమల ప్రతిష్టతను మంట గలుపుతున్నారు. ఈ విషయం పై మాజీ టిటిడి విజిలెన్స్‌ చీఫ్ స్పందించారు. తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు అ త్యంత అవినీతిపరుడని టీటీడీ మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి బీవీ రమణకుమార్‌ ఆరోపించారు. 2008లోనే తాను ఈ మేరకు అధికారికంగా నివేదిక ఇచ్చానన్నారు.

ttd 25052018 2

దాదాపు రు.5లక్షల మేరకు అన్నదానం కోసం ఇచ్చిన విరాళాన్ని రమణదీక్షితులు సొంత ఖాతాకు మళ్లించారని, ఈ విషయం సాక్ష్యాధారాలతో తాను నిరూపించానని రమణకుమార్‌ చెప్పా రు. అయితే ప్రధాన అర్చకుడి విషయం బయటకు పొక్కితే ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటుందని భావించి ఆయనను మందలించి వదిలేశారని తెలిపారు. రమణ దీక్షితులుపై ఇంకా చాలా ఆరోపణలున్నాయని అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యవహారశైలి చూస్తుంటే బీజేపీ రాజకీయాలకు అనుగుణంగా పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోందని అన్నారు. ప్రధాన అర్చకుడి స్థాయిలో ఉన్న వ్యక్తికి రాజకీయాలతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు.

ttd 25052018 3

రమణ దీక్షితులు చెప్పిన ఆధారాల మేరకు వజ్రం పగిలిపోవడంపై తాను నివేదిక ఇచ్చానని, ఆ విషయంపై అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అసెంబ్లీలో సీబీఐ విచారణను కోరారని, సభా కమిటీ వేయమని డిమాండ్‌ చేశారని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో టీటీడీ చైర్మన్‌గా కరుణాకర్‌ రెడ్డి, బోర్డు సభ్యుడుగా విజయసాయి రెడ్డి ఉన్నారని తెలిపారు. రమణ దీక్షితులు కోరినట్లు సీబీఐ విచారణ అంటూ జరిగితే ఎవర్ని విచారించాలో అర్థమవుతుందని ఆయన అన్నా రు. భగవంతుడి విషయంలో రాజకీయాలు చేయడం సరైంది కాదని రమణ కుమార్‌ పేర్కొన్నారు. ఈ మొత్తం ఉదంతం వెనుక రాజకీయ కుట్ర లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read