"ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సన్ రైజ్ స్టేట్ కాదు, సన్ షైన్ స్టేట్... ప్రపంచం భారత వైపు చూస్తుంటే... భారతకు వచ్చిన వారు ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి! అపార వనరులు, వ్యాపార నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఉన్న నవ్యాంధ్రకు రండి! పెట్టుబడులు పెట్టండి!"... ఇది వివిధ సందర్భాలో పారిశ్రామిక వర్గాలకు చంద్రబాబు ఇచ్చిన మెసేజ్... ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలు విశ్లేషించుకుని, ముఖ్యమంత్రి పరిపాలనా దక్షత, మన రాష్ట్ర పాలసీలు నచ్చి, గత ఫిబ్రవరిలో విశాఖ వేదికగా జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడుల పంట పండింది...అయితే ఈ సమ్మిట్ల పై జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ లాంటి విపక్ష నేతలు ఎంతో అవహేళనగా మాట్లాడటం చూసాం.. ఇప్పుడు విశాఖ భాగస్వామ్య సదస్సు ఫలితాలు కనిపిస్తున్నాయి.
మొదటిదశలో 18 సంస్థలతో రూ.2955.52 కోట్ల పెట్టుబడులు పెట్టటానికి కంపనీలు రెడీ అయ్యాయి. డీపీఆర్ అందించిన వీరికి, సింగలి విండో పోర్టల్ ద్వారా తదుపరి అనుమాతలు ఇస్తున్నారు. ఫిబ్రవరి 24 నుంచి 26 మధ్య మూడు రోజులపాటు విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో దేశ, విదేశాలకు చెందిన వివిధ పారిశ్రామిక సంస్థలు పలు రంగాల్లో రూ.4.39 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. వీటిలో పరిశ్రామిక రంగంలో చేసిన ఒప్పందాలు సాకారమయ్యేలా గత రెండు నెలలుగా అధికారులు యత్నిస్తున్నారు. 60 పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు చేసి మూడు విడతలుగా నిర్వహించిన సమావేశాలకు 40 సంస్థల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
మొదటి విడతగా 18 సంస్థలతో పెట్టుబడులు పెట్టించేలా రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), విద్యుత్తు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ), కర్మాగారాల, పరిశ్రమలశాఖల నుంచి తదుపరి అనుమతులిచ్చేలా ఉన్నత స్థాయి సమావేశం ఆదేశాలిచ్చింది. మొదటి విడతలో ముందుకొచ్చిన సంస్థల్లో అత్యధికం విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ మేరకు ఏపీఐఐసీ తరఫున వీరందరికీ స్థలాల కేటాయింపుల కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పెట్టుబడుదారుల్లో కొందరు పారిశ్రామికవాడల్లో భూములు, స్థలాలను పరిశీలించాయి.