గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామరావు నేతృత్వంలో 1986లో విజయవాడ వేదికగా నేషనల్ ఫ్రంట్ అంకురార్పణ జరిగిన నేపథ్యంలో, మరోసారి ఇదే వేదికగా జరుగుతున్న మహానాడు ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని ప్రాంతీయ పార్టీలను, జాతీయ రాజకీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఆనాడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం, మరోసారి ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ వేదిక ఒక కొత్త ఫ్రంట్ కు అంకుర్పారణ కానుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లకు ప్రత్యామన్యాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే యోచనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉన్నారు. తాజాగా జరిగిన తెలంగాణ మహానాడులో జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన సరికొత్త చర్చకు దారితీయడమే కాకుండా, జాతీయ రాజకీయాలపై ఒక స్పష్టత వచ్చింది.

cbn 27052018 2

గతంలో విజయవాడ నుంచి జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ చక్రం తిప్పగా, ఆదే స్పూర్తితో చంద్రబాబునాయడు మరోసారి జాతీయ రాజకీయాల్లో తనదైన శైలిలో కీలక పాత్రపోషించడానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి వాజీపేయి, దేవగౌడలను ప్రధాన మంత్రులు చేసిన అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు, మరోసారి తన సత్తాను చాటుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కేంద్రంలో బీజీపీ మరోసారి అధికారంలోకి రాకుండా చూసేందుకు దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. భాజపాను ఏకాకిని చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశకు అండగా నిలుస్తారనే భావంతో భాజపాతో జతకట్టిన చంద్రబాబుకు చివరకు ఆశభంగమే ఎదురైంది.

cbn 27052018 3

విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల అమలు విషయంలో తాత్సారం చేయడంతో పాటు, రాష్ట్రానికి రావాల్సిన న్యాయబద్దమైన నిధుల విడుదలలో కూడా కేంద్ర మొండి వైఖరి వ్యవహరిస్తుందంటూ ఇప్పటికే బిజెపి ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. నాలుగేళ్లగా విభజన చట్టంలో పొందుపరిచన అంశాలను అమలు చేయాలని కోరుతూ 20 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా ప్రధాని మోడీ పెడచెవిన పెట్టారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి బాసటగా నిలుస్తామని చెప్పి, మోసం చేయడమే కాకుండా తెదేపా పై ఎదురుదాడికి తెగబడటంతో ఎన్డీఏ నుంచి బయటకు రావడమే కాకుండా, మిత్రబంధాన్ని సైతం వదులుకున్నారు. ఆనాటి నుంచి రాష్ట్రాల హక్కులు, నిధుల విషయంలో స్వరాన్ని పెంచడంతో పాటు కేంద్రం పై విమర్శనాస్త్రాలను సంధిస్తువస్తున్నారు.

అయితే నాలుగేళ్లు గడిచిన మిత్ర ధర్మం పాటించని భాజపాపై తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో రాష్ట్రంలో ధర్మపోరాట దీక్షలు చేపట్టడంతో పాటు సభలు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వస్తున్నారు. మరోవైపు తాజాగా జరిగిన కర్నాటక ఎన్నికల్లో సైతం అక్కడ సిరపడిన తెలుగువారిని బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చి, జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశారు. అక్కడి తెలుగువారు కూడా సానుకూలంగా స్పందించి బీజేపీ అభ్యర్థులను మట్టికరిపించి ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయం పై తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో అన్ని ప్రాంతీయ పార్టీల దృష్టి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పై పడింది. దీనిని ఒక అవకాశంగా భావించిన చంద్రబాబు వారందరిని ఒకే వేదిక పై తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యారు. కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి,తృణముల్ పార్టీ అధినేత మమతబేనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్తో ఈ దిశగా చర్చలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న మహానాడులో జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరించాల్సిన తీరు పై సవివరంగా చర్చించనున్నారు. దీనికి సంబంధించి పార్టీ భవిష్యత్ కార్యాచరణను చంద్రబాబునాయుడు ఆ మహానాడు వేదికగా ప్రకటించనున్నారు. దీంతో జాతీయ రాజకీయాల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించనున్నదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read