వర్చ్యువల్ రియాలిటీ, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ... ఇవన్నీ మాట్లాడుతుంది, ఈ టెక్నాలజీలు వాడుతుంది, ఏ మైక్రోసాఫ్ట్, గూగులో అనుకునేరు... ఇవన్నీ మాట్లాడుతుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి... మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు... టెక్నాలజీ పట్ల, ఆయనకు ఉన్న అవగాహన, టెక్నాలజీ ఉపయోగించుకుని సమర్ధవంతమైన పరిపాలన చెయ్యటం, టెక్నాలజీతో ఉద్యోగాల కల్పన ఇవన్నీ చూశాం... ఇప్పుడు మరో సరి కొత్త టెక్నాలజీ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు... అదే "అలెక్సా"... జనవరిలో జరిగిన సిఐఐ సమ్మిట్ లో చంద్రబాబు, ఈ విషయం చెప్తే అందరూ నవ్వారు.. ఇప్పుడు ఇది రియాలిటీలోకి వస్తుంది...
‘హాయ్ చంద్రన్న’ అంటే చాలు, అన్ని పనులు చేసి పెట్టేలా యాప్‌ను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ‘‘అలెక్సా, గుగూల్ ఓకే లాగా.... హాయ్ చంద్రన్న యాప్ ద్వారా పలకరిస్తే... ఏ సమస్యని అయినా పరిష్కరించి ఎప్పటికప్పుడు సమాచారమందిస్తాం. పెన్షన్ ఎందుకు రాలేదనేది ఇంట్లో కూర్చోని తెలుసుకోవచ్చు’’ అని నిన్న జరిగిన సాధికార మిత్రల సమావేశంలో వివరించారు. భవిష్యత్తు పాలనలో సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయికి విస్తరిస్తుందో వివరిస్తూ దీనిని, అక్కడ ఉన్న సాధికార మిత్రలకు పరిచయం చేసారు.
వాయిస్ ఇంటరాక్టివ్ సిస్టమ్ ద్వారా ఈ యాప్ పని చేస్తుంది. సీఎం డ్యాష్‌బోర్డుకు వాయిస్ ఇంటరాక్టివ్ సిస్టమ్ ద్వారా కనెక్ట్ చేసి, మన సమస్య తెలుసుకుని సమాధానం ఇస్తుంది. ప్రజలు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానమిస్తుంది. ప్రజలు ఇంటి నుంచే ఈ సాఫ్ట్‌వేర్‌తో నేరుగా మాట్లాడొచ్చని, ఆఖరికి నీటి సమస్యలు, ఇతర ఏ సమస్యల గురించి చెప్పినా ‘హాయ్ చంద్రన్న’ నేరుగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పరిష్కారమయ్యేలా చూస్తుందని చంద్రబాబు అన్నారు. ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం, దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ వద్ద తప్పితే మరెక్కడా లేదని చంద్రబాబు చెప్పారు.