అమిత్ షా ఆదేశాలు మేరకు, ఆయన వచ్చి వెళ్ళిన రెండో రోజే, ఒక పధకం ప్రకారం ఎలా దాడి చేస్తున్నారో చూస్తున్నాం... తిరుమలలో ఎదో జరిగిపోతుంది అని, చివరకు స్వామి వారికి కూడా నైవేద్యం కూడా పెట్టటం లేదు అంటూ, పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్లిపోయిందని, స్వామి వారి పూజా కైంకర్యాల వ్యవహారంలో అధికారులు తలదూరుస్తున్నారని, వకుళామాత పోటులో బండలు మార్చే నిమిత్తం చాలా రోజులుగా దానిని మూసివేశారని ఇలా అన్ని విషయాలు చూసుకునే ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు గారు, సరిగ్గా రిటైర్డ్ అయ్యే ముందు రోజు, అమిత్ షా వచ్చి వెళ్ళిన తరువాత, రచ్చ మొదలు పెట్టారు.
అయితే, తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలను టీటీడీ తిప్పికొట్టింది. రమణ దీక్షితులు అసత్య ఆరోపణలు చేశారంటూ... ఆధారాలతో సహా టీటీడీ బయట పెట్టింది. పోటు మరమ్మతు పనులతో వెయ్యికాళ్ల మండపం కూల్చివేతకు... రమణ దీక్షితులు ఆమోదం తెలిపిన పత్రాలను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి ఆలయ౦లోని వకుళామాత పోటులో... ఎటువంటి తవ్వకాలు టీటీడీ జరపని చెప్పింది. కేవలం మరమ్మతులను మాత్రమే చేశామని టీటీడీ తెలిపింది. పోటును మీడియాకు చూపించి అనుమానాలను టీటీడీ నివృత్తి చేసింది.
టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై రమణదీక్షితులు ఆరోపణలు చేస్తున్నారు. తిరుమల ఆలయ వ్యవస్థ మీదే అనుమానాలు వ్యక్తం చేస్తూ వార్తలకు ఎక్కుతున్నారు. నిజానికి ఆయన వ్యవహారశైలి తొలినుంచీ ఇలాగే ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. పలు సందర్భాల్లో ఆయన తను కొలువున్న వ్యవస్థనే ఇరుకునపెట్టేలా ప్రవర్తించారని, ఆగమశాస్త్రం, ఆచార వ్యవహారాలు, నియమాలు అని మాట్లాడుతున్న రమణదీక్షితులు.. ఆయనే వాటిని చాలాసార్లు ఉల్లంఘించారనే విమర్శులున్నాయి.